📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలు🇮🇳 త్రివర్ణ పతాకం కింద ఏకమై నిలిచిన మిలిగిరి పేట 🇮🇳

🇮🇳 త్రివర్ణ పతాకం కింద ఏకమై నిలిచిన మిలిగిరి పేట 🇮🇳

📰 Generate e-Paper Clip

•గ్రామోత్సవ వాతావరణంలో 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు
సదాశివాపేట.జనవరి26(మనప్రజాప్రతినిధి)
మిలిగిరి పేట గ్రామంలో 77వ గణతంత్ర దినోత్సవాన్ని గ్రామోత్సవ వాతావరణంలో ఘనంగా నిర్వహించారు. గ్రామ పంచాయతీ కార్యాలయం వద్ద సర్పంచ్ షాబుద్దీన్ జాతీయ జెండానుఆవిష్కరించి గణతంత్ర దినోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టారు.అనంతరం మిలిగిరి పేట పాఠశాల ప్రాంగణంలో నిర్వహించిన కార్యక్రమంలో ఉపసర్పంచ్ యాదయ్య, వార్డు మెంబర్లు, పోలీస్ పద్మమ్మ, మల్లారెడ్డి, టేకురి జయమ్మ, సంగారెడ్డి రాములమ్మ, సాబీరా, శ్రీనివాస్ పాల్గొన్నారు.
గ్రామ పెద్దలు రామ్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, హనుమంత్ రెడ్డి, సుభాన్ రెడ్డి, లక్ష్మణ్, బ్రహ్మానందరెడ్డి, అశోక్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఊశయ్య, కిష్టప్ప, మైపాల్, లింగన్న, హైమద్, షమీన్ తదితరులు హాజరై వేడుకలకు వన్నె తెచ్చారు. ఉపాధ్యాయులు, అంగన్వాడీ టీచర్లు, గ్రామ యువకులు, మహిళలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
🏐 గణతంత్ర దినోత్సవ క్రీడా సంబరాలు
వేడుకల్లో భాగంగా గ్రామ యువకులతో వాలీబాల్ పోటీలను నిర్వహించారు. ఆరు జట్లు పోటీపడగా, ఫైనల్లో నరేందర్ జట్టు – రామాచారి జట్టు తలపడ్డాయి. ఉత్కంఠభరిత పోటీలో నరేందర్ జట్టు విజయం సాధించింది.విజేత జట్టులో రియాజ్, మోహన్ రాజు, మేరాజ్, ప్రణీత్, అభిలాష్ రెడ్డి ప్రతిభ చూపారు.విజేతలకు మల్లారెడ్డి, సుభాన్ రెడ్డి రూ.5,000 నగదు బహుమతిఅందజేయగా, రన్నర్‌అప్ జట్టుకు మధుకర్ రెడ్డి, సంగమేశ్వర్ రెడ్డి రూ.2,000 బహుమతి అందజేశారు.దేశభక్తి, ఐక్యత, క్రీడా స్ఫూర్తి మేళవించిన వేడుకగా మిలిగిరి పేట గణతంత్ర దినోత్సవం నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular