•భక్తిశ్రద్ధలతో ప్రసాదం పంపిణీ – అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకుల విజ్ఞప్తి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటజిల్లా,గజ్వేల్:ఫిబ్రవరి02
గజ్వేల్ పట్టణ పరిధిలోని అంగడిపేట హనుమాన్ దేవాలయం వద్ద ప్రతి మంగళవారం నిర్వహించే పులిహోర పంపిణీ కార్యక్రమం రేపు (ఫిబ్రవరి 03) ఘనంగా జరగనుంది. భక్తుల ఆరాధనతో పాటు ఆధ్యాత్మిక వాతావరణంలో ఈ కార్యక్రమం ఉదయం 9:30 గంటలకు ప్రారంభం కానుంది.ఈ పుణ్యకార్యానికి దాతలుగా శ్రీమతి & శ్రీ నాయిని సత్యలక్ష్మి-యాదగిరి దంపతులు.వారికుటుంబసభ్యులు వ్యవహరిస్తున్నారు. వారి ఆధ్వర్యంలో హనుమాన్ భక్తులకు పులిహోర ప్రసాదాన్ని భక్తిశ్రద్ధలతో పంపిణీ చేయనున్నారు.ప్రతి వారం భక్తుల విశేష ఆదరణ పొందుతున్న ఈ కార్యక్రమంలో ఈసారి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని, ప్రసాదం స్వీకరించి పుణ్యఫలం పొందాలని నిర్వాహకులు కోరారు.

