📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమరో అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

మరో అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేస్తా

📰 Generate e-Paper Clip

-13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానంద

మన ప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 4:
నారాయణఖేడ్ మునిసిపాలిటీ ఎన్నికల్లో భాగంగా 13వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వివేకానంద బుధవారం విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఇంటింటా తిరుగుతూ ఓటర్లను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఇప్పటికే వార్డులో మౌలిక సదుపాయాల అభివృద్ధి చేపట్టామని, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని ప్రజలకు గుర్తు చేశారు. మరోసారి ప్రజల ఆశీర్వాదిస్తే అభివృద్ధి కార్యక్రమాలను మరింత వేగంగా అమలు చేస్తానని హామీ ఇచ్చారు.
తాగునీరు, డ్రైనేజీ, రోడ్లు, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలను ప్రాధాన్యతగా తీసుకుని శాశ్వత పరిష్కారాలు చూపుతానన్నారు. అలాగే పేదల సంక్షేమం, యువతకు ఉపాధి అవకాశాలు, మహిళల భద్రత కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటానని తెలిపారు. ప్రజల నమ్మకమే నా బలం. మరో అవకాశం ఇస్తే 13వ వార్డును ఆదర్శ వార్డుగా తీర్చిదిద్దుతాను అని వివేకానంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చి తనను గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular