📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసిల్లలో ఎన్నికల నిఘా గట్టిగా…రూ.4 లక్షల నగదు స్వాధీనం

సిరిసిల్లలో ఎన్నికల నిఘా గట్టిగా…రూ.4 లక్షల నగదు స్వాధీనం

📰 Generate e-Paper Clip

•ఎన్నికల కోడ్ అమల్లో అధికారుల విస్తృత తనిఖీలు
తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద పట్టుబడ్డ నగదు
పత్రాలు చూపితేనే నగదు తిరిగి ఇవ్వనున్న అధికారులు
ఆధారాలు లేకపోవడంతో సీజ్ – పత్రాలు సమర్పిస్తేనే విడుదల
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల.ఫిబ్రవరి05
ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులో భాగంగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో అధికారుల నిఘా మరింత కట్టుదిట్టమైంది. ఈ క్రమంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.4 లక్షల నగదు అధికారుల చేతికి చిక్కింది.సిరిసిల్ల మున్సిపాలిటీ పరిధిలోని తంగళ్ళపల్లి బ్రిడ్జి వద్ద స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్ (SST) తనిఖీలు చేపట్టగా, పురుమండ్ల వెంకట్ రెడ్డి అనే వ్యక్తి వద్ద సరైన ఆధారాలు లేకుండారూ.4,00,000 నగదు గుర్తించారు. నిబంధనల మేరకు నగదును స్వాధీనంచేసుకుని సిరిసిల్ల ఎస్‌హెచ్‌ఓకు అప్పగించారు.నగదుకు సంబంధించిన చెల్లుబాటు అయ్యే పత్రాలు సమర్పించిన తరువాత ఆర్‌డీఓ కార్యాలయంలో గ్రీవెన్స్ నమోదు చేసుకుని నగదును తిరిగి పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ తనిఖీల్లో ఐ/సి అధికారి వి.ప్రశాంత్ సహా సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular