📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయి కుంగ్ ఫు పోటీల్లో సిరిసిల్ల విద్యార్థినుల ప్రభంజనం

రాష్ట్రస్థాయి కుంగ్ ఫు పోటీల్లో సిరిసిల్ల విద్యార్థినుల ప్రభంజనం

📰 Generate e-Paper Clip

•ఇద్దరికీ బంగారు పతకాలు-జిల్లాకు గర్వకారణం
మనప్రజాప్రతినిధి//రాజన్న సిరిసిల్ల,ఫిబ్రవరి08:
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని త్రినేత్ర ఫంక్షన్ హాల్ వేదికగా ఆదివారం నిర్వహించిన రాష్ట్రస్థాయి కుంగ్ ఫు, కరాటే పోటీల్లో రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన విద్యార్థినులు అద్భుత ప్రతిభ కనబరిచి బంగారు పతకాలను కైవసం చేసుకున్నారు. కే.ఆర్. కుంగ్ ఫు అకాడమీ మాస్టర్ కుందేళ్ల రవి ఆధ్వర్యంలో పోటీలు ఉత్సాహంగా నిర్వహించబడ్డాయి.స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ నుండి మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్ పర్యవేక్షణలో పాల్గొన్న విద్యార్థినులు తమ తమ విభాగాల్లో ప్రథమ స్థానాలు సాధించారు. కంచర్ల శ్రీనిక బ్లాక్ బెల్ట్ చిల్డ్రన్ వెపన్ కటా విభాగంలో, లింగం శ్లోక జూనియర్ బ్లాక్ బెల్ట్ వెపన్ కటా విభాగంలో బంగారు పతకాలు సాధించి జిల్లాకు గౌరవం తీసుకొచ్చారు.రాష్ట్రస్థాయిలో రాణించిన విద్యార్థినులను, వారికి శిక్షణ అందించిన మాస్టర్ వోడ్నాల శ్రీనివాస్‌ను స్పార్క్ కుంగ్ ఫు అకాడమీ ఇండియా గ్రాండ్ మాస్టర్ ఎం.ఏ. హమీద్, మాస్టర్లు సయ్యద్ యాకుబ్, కోటేశ్వర్ అభినందించారు. క్రీడల్లో రాణించడం ద్వారా క్రమశిక్షణతో పాటు ఆత్మరక్షణ నైపుణ్యాలుపెంపొందుతాయని వారు పేర్కొన్నారు.
ఈ విజయంపై క్రీడాభిమానులు, స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.