📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురాష్ట్రస్థాయి పోటీలకు ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థుల ఘన విజయం

రాష్ట్రస్థాయి పోటీలకు ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థుల ఘన విజయం

📰 Generate e-Paper Clip

•జిల్లా స్థాయిలో సత్తా చాటి‘చీఫ్ మినిస్టర్ కప్’లోరాష్ట్ర స్థాయి అర్హత సాధించిన క్రీడాకారులు
మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్లజిల్లా,ఫిబ్రవరి18
జిల్లా స్థాయి చీఫ్ మినిస్టర్ కప్-2026 క్రీడల్లో స్థానిక ఇంగ్లీష్ యూనియన్ హై స్కూల్ విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వివిధ క్రీడాంశాల్లో తమ సత్తా చాటి పాఠశాల పేరును జిల్లా వ్యాప్తంగా మారుమోగించారు.
రాష్ట్ర స్థాయికి ఎంపికైన క్రీడాకారులు:
బాస్కెట్‌బాల్: అన్విత, హరిణి, అద్వైత్, యశ్వంత్
సాఫ్ట్‌బాల్: చరణ్ తేజ్, సిద్ధార్థ, అద్నాన్ అలీ, రుత్విక్
నెట్‌బాల్: నితిన్, హర్షవర్ధన్
ఖో-ఖో: విగ్నేష్, అవంతిక
హ్యాండ్‌బాల్: ప్రణయ్
ఫుట్‌బాల్: నరేష్
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థులను పాఠశాల ప్రిన్సిపాల్ రాజ్‌కుమార్, వ్యాయామ ఉపాధ్యాయుడు (పిఈటీ) రాజశేఖర్ మరియు ఉపాధ్యాయ బృందం ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడల్లోనూ విద్యార్థులు రాణించడం గర్వకారణమని, రాష్ట్ర స్థాయి పోటీల్లో కూడా ప్రతిభ చాటి జిల్లా మరియు పాఠశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. విద్యార్థుల విజయంపై తల్లిదండ్రులు, తోటి విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.