📄 ePaper
Sunday, August 9, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు.

ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో ఘనంగా బోనాల వేడుకలు.

📰 Generate e-Paper Clip

°తెలంగాణ సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించేలా ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో బోనాల వేడుకలు ఘనంగా నిర్వహించారు.

సిద్దిపేటనియోజకవర్గం,మనప్రజాప్రతినిధి:ఆగస్టు9
ఆదర్శ విద్యానికేతన్ హైస్కూల్‌లో బోనాల పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల విద్యార్థులు, ఉపాధ్యాయులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని బోనాల పండుగ విశిష్టతను చాటిచెప్పారు. ఈ సందర్భంగా విద్యార్థులు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించి అలరించారు.
పాఠశాల కరస్పాండెంట్ సీహెచ్. సంతోష్ ఆధ్వర్యంలో, ప్రిన్సిపాల్ జి. రమాదేవి పర్యవేక్షణలో బోనాల వేడుకలు నిర్వహించారు. విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన కల్పిస్తూ బోనాల పండుగ ప్రాముఖ్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ఇన్‌చార్జిలు రజిత, మమత, ఖైరున్నిసా, భాగ్య, గాయత్రి, సుప్రియ, గ్లోరీ, కె.మౌనిక,స్వరూప తదితరులు పాల్గొని వేడుకలను విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular