“50 మంది రైతులకు నోటీసులు.. ఆధారాల పరిశీలన
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.సెప్టెంబర్24
కొండపాక మండలం వెలికట్ట గ్రామ శివారులోని 271 సర్వే నంబర్‌లో ఉన్న 327.09 ఎకరాల ప్రభుత్వ భూములపై అధికారులు సర్వే నిర్వహిస్తున్నారు. గజ్వేల్ డివిజన్ రెవెన్యూ ఇన్‌స్పెక్టర్ వంశీ ఆధ్వర్యంలో సర్వే ప్రక్రియ కొనసాగుతోంది.
ఈ సందర్భంగా అధికారులు రికార్డులను పరిశీలిస్తూ భూముల హద్దులను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. 271 సర్వే నంబర్ పరిధిలో మొత్తం 329 మంది రైతులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మరో రెండు రోజుల్లో సర్వే నంబర్‌లోని మొత్తం భూమికి సర్వే, కొలతలు పూర్తి చేసి హద్దులను నిర్ధారిస్తామని వెల్లడించారు.
ఇప్పటికే 50 మంది రైతులకు నోటీసులు జారీ చేసినట్లు అధికారులు తెలిపారు. తమ భూములకు సంబంధించిన పట్టాదారు పాస్‌బుక్‌లు, రిజిస్ట్రేషన్ పత్రాలు, ఇతర ఆధారాలను చూపించిన రైతుల భూములను పరిశీలించి హద్దులను అధికారులు నిర్ణయిస్తున్నారు.
271 సర్వే నంబర్ పరిధిలో భూములు కలిగి ఉన్న రైతులు తమ భూములకు సంబంధించిన ఆధారాలను అధికారులకు సమర్పించాలని సూచించారు. రైతులు తమ వద్ద ఉన్న పత్రాలను అధికారులకు అందజేస్తున్నారు. పత్రాల పరిశీలన అనంతరం భూములను గుర్తించి, సంబంధిత హద్దులను ఏర్పాటు చేసే ప్రక్రియ కొనసాగుతోంది.
271 సర్వే నంబర్‌లో అధికారుల సర్వే
RELATED ARTICLES



