📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుజిల్లా మక్క రైతుల గోస… పంట అమ్మినా డబ్బులు రాక నెల దాటింది

జిల్లా మక్క రైతుల గోస… పంట అమ్మినా డబ్బులు రాక నెల దాటింది

📰 Generate e-Paper Clip

మన ప్రజా ప్రతినిధి//
అక్బర్ పేట–భూంపల్లి మండల్, దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట.

మిరుదొడ్డి, నవంబర్ 27:
328 మంది రైతులకు రూ. 2.18 కోట్ల బకాయిలు –యాసంగిసాగుకు తీవ్ర ఆర్థిక ఇబ్బందులువానాకాలంలో భారీవర్షాలు,తుపాన్లప్రభావం… యూరియా కొరత… పంట దిగుబడి తగ్గుదల—ఈ ఏడాది మక్క రైతులకు ఒక్కటైనా సాంత్వన కలగలేదు. పండించిన మక్కలను అమ్మినెలదాటినాప్రభుత్వంనుంచిడబ్బులుఖాతాల్లోకిజమకాకపోవడంతో రైతుల ఇబ్బందులు మరింతపెరిగిపోయాయి.సకాలంలోకొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో అనేక మంది రైతులు దళారుల చేతికి క్వింటాలుకు రూ.1800కే మక్కలు అమ్ముకోవాల్సి వచ్చింది. దీంతో క్వింటాలుకు రూ.800 వరకు నష్టం వాటిల్లిందని రైతులు చెబుతున్నారు.దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రయత్నాలతో అక్టోబర్ 25న మిరుదొడ్డి పీఏసీఎస్ ఆధ్వర్యంలో మక్కల కొనుగోలు కేంద్రం ప్రారంభమైనప్పటికీ…దుబ్బాక, దౌల్తాబాద్, అక్బర్ పేట–భూంపల్లి మండలాల రైతులందరూ ఒకే కేంద్రానికి రావడంతో భారీ రద్దీ ఏర్పడి రోజులు తరబడి రైతులు క్యూలైన్లలో వేచి చూడాల్సి వచ్చింది.10,250 క్వింటాళ్ల మక్కలు కొనుగోలు – రూ. 2.18 కోట్లు బకాయి.అక్టోబర్ 25 నుంచి నవంబర్ 20 వరకు 328 మంది రైతుల నుంచి 10,250 క్వింటాళ్ల మక్కలను కొనుగోలు చేశారు.
20,500 బ్యాగుల్లో ఉన్న ఈ మక్కలను 28 బారీల్లో తరలించినప్పటికీ…రైతులకు రావాల్సిన రూ. 2.18 కోట్ల చెల్లింపులు మాత్రం ఇంకా జారవిడుదల కాలేదు.యాసంగి పంట సీజన్ మొదలవడంతో వరి విత్తనాలు, ఎరువులు, నారు ఏర్పాటుకు డబ్బులు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.రైతులు ప్రభుత్వం వెంటనే మక్కల డబ్బులు విడుదల చేయాలని, లేకపోతే ఆందోళనలు తప్పవని హెచ్చరిస్తున్నారు.“ఖాతాల్లో డబ్బులు వెంటనే జమ చేయాలి” – రైతుల వేదన“నేను 72 క్వింటాళ్ల మక్క అమ్మి నెలరోజులు అయ్యింది. నాకు రావాల్సిన రూ.1,72,800 ఇప్పటికీ రాలేదు. యాసంగిలో వరి నారు వేసుకోవాలంటే పైసలు కూడా లేవు.ఇలాంటిసమయంలోప్రభుత్వానికి డబ్బులు ఇవ్వడంలో ఏం ఇబ్బంది? వెంటనే మామక్కల డబ్బులు చెల్లించాలని కోరుతున్నా.”— మొగుళ్ల మహేశ్వరి, మహిళా రైతు, మిరుదొడ్డి (సిద్దిపేట)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.