మన ప్రజాప్రతినిధి — అక్బర్ పేట్ భూంపల్లి
దుబ్బాక నియోజకవర్గం, సిద్దిపేట జిల్లా
“ప్రజల ఆపతే నా ఆపతి” అభివృద్ధి కాంక్షనే నా సోపతి.”అంటున్న సర్పంచ్ అభ్యర్థిదుబ్బాక మండలంలోని తిమ్మాపూర్ గ్రామ సర్పంచ్ పదవికి ప్రముఖ సినీ కామెడియన్ గుర్రాల సుబ్బు బరిలో నిలిచారు. గ్రామ ప్రజల సమస్యలను తన వ్యక్తిగత బాధ్యతగా తీసుకుంటానని, పేదల బాధనే తన బాధగా భావించి ప్రజా సేవకోసంముందుకొచ్చానని ఆయన తెలిపారు.దళిత కుటుంబంలో పెరిగిన తనకు గ్రామ అభివృద్ధి పట్ల ప్రత్యేక నిబద్ధత ఉందని సుబ్బు పేర్కొన్నారు. ఎన్నేళ్లుగాగ్రామంలోనిపేదవర్గాలసమస్యలుపెండింగ్‌లోనేఉన్నాయని,వాటినిపరిష్కరించేందుకు అవకాశం ఇవ్వాలని ప్రజలను కోరారు.సర్పంచ్‌గా గెలిచినట్లయితే తిమ్మాపూర్‌ను సమగ్ర అభివృద్ధి దిశగా తీసుకెళ్లేందుకు కృషి చేస్తానని సుబ్బు హామీ ఇచ్చారు. ప్రజలు నమ్మకం ఉంచి ఓటు వేస్తే, అది సేవ చేసే సువర్ణావకాశంగా భావించి నిరంతరం ప్రజల కోసం పనిచేస్తానని ఆయన తెలిపారు.
తిమ్మాపూర్ సర్పంచ్ బరిలో సినీ కామెడియన్ గుర్రాల సుబ్బు
RELATED ARTICLES

