📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సర్పంచులుగా… ప్రజల తీర్పుతో ఘన విజయం!

ఫీల్డ్ అసిస్టెంట్ల నుంచి సర్పంచులుగా… ప్రజల తీర్పుతో ఘన విజయం!

📰 Generate e-Paper Clip

మోహన్ గౌడ్, సిహెచ్ మల్లేశం భారీ మెజార్టీతో గెలుపొందారు
సదాశివపేట.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)
గ్రామస్థాయి సేవ నుంచే నాయకత్వం పుడుతుందనే విషయాన్ని మరోసారి రుజువు చేస్తూ సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్లు గ్రామపంచాయతీ సర్పంచులుగా ఎన్నికై ఘన విజయం సాధించారు.మాచిరెడ్డిపల్లిలో స్వతంత్ర అభ్యర్థిగా సంచలన విజయంమాచిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మోహన్ గౌడ్ ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకుని భారీ మెజార్టీతో సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సేవా భావం, ప్రజలతో ఉన్న సాన్నిహిత్యమే ఆయన విజయంలో కీలకంగా మారింది.ఎల్లారం గ్రామంలో కాంగ్రెస్ జెండా ఎగరేసిన సిహెచ్ మల్లేశంఎల్లారం గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ సిహెచ్ మల్లేశం కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలోకి దిగి భారీ మెజార్టీతో గెలుపొందారు. ప్రజల సమస్యలపై అవగాహన, అంకితభావం ఆయనకు ప్రజల మద్దతు తెచ్చిపెట్టింది.తోటి ఫీల్డ్ అసిస్టెంట్ల ఘన సన్మానం
ఈ ఘన విజయాన్ని పురస్కరించుకుని తోటి ఫీల్డ్ అసిస్టెంట్లు నరేందర్, రాజేందర్, సిద్దన్న, రాజు, శ్రీనివాస్, రమేష్ తదితరులు కలిసి నూతనంగా ఎన్నికైన సర్పంచులు మోహన్ గౌడ్, సిహెచ్ మల్లేశంను శాలువాలతో ఘనంగా సన్మానించారు.
సేవ నుంచి నాయకత్వం దాకాఫీల్డ్ అసిస్టెంట్లుగా ప్రజల మధ్య పనిచేసిన అనుభవంతో గ్రామాభివృద్ధికి అంకితంగా పనిచేస్తామనే నమ్మకాన్ని ఇద్దరు సర్పంచులు వ్యక్తం చేశారు. గ్రామాల అభివృద్ధి కోసం కలిసి ముందుకు సాగుతామని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.