📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకేంద్రం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు: వికలాంగుల ఉపాధి హక్కుపై భారం

కేంద్రం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు: వికలాంగుల ఉపాధి హక్కుపై భారం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్21

మెదక్: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ రోజ్‌గార్ – ఆజీవికా మిషన్ (గ్రామీణ్) బిల్లు, 2025 (VB-GRAMG) వికలాంగుల జీవనోపాధి హక్కులపై తీవ్ర ప్రభావం చూపుతుందని రాష్ట్ర వికలాంగుల హక్కుల జాతీయ వేదిక ప్రధాన కార్యదర్శి యం. అడివయ్య హెచ్చరించారు.
ఈ సందర్భంగా మెదక్ పట్టణంలో వికలాంగుల హక్కుల వేదిక ఆధ్వర్యంలో బిల్లుప్రతులను దగ్ధం చేశారు. యం. అడివయ్య మాట్లాడుతూ, కేంద్రం తీసుకువచ్చిన VB-GRAMG బిల్లు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (MGNREGA)ను నిర్ధిష్టంగా ప్రభావితం చేస్తుందని అన్నారు.
ఉపాధి హామీ పథకం ప్రాముఖ్యత వికలాంగులు, భూభారములు లేని, నిరుద్యోగంలో ఉన్న పేదరికంలో ఉన్న గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కల్పించడానికి MGNREGA చట్టం ప్రవేశపెట్టబడిందని తెలిపారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో 6,38,088 మంది వికలాంగులకు ఈ పథకం ద్వారా ఉపాధి లభించిందని చెప్పారు.
VB-GRAMG బిల్లు వల్ల ఉపాధి హామీ పథకం నిర్వీర్యం అవుతుందని, గ్రామీణ వికలాంగ కార్మికుల జీవనోపాధి, గౌరవం, మనుగడకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.125 రోజుల పని వాదన తప్పిదం కేంద్రం 125 రోజుల పనిని అందిస్తుందని వాదిస్తున్నప్పటికీ, వాస్తవంలో సగటు ఉపాధి 50 రోజులకు తక్కువగా ఉందని ఆయన అన్నారు. అలాగే, మహాత్మా గాంధీ పేరును తొలగించడం, VB-GRAMG బిల్లును కొత్త పేరుతో ప్రవేశపెట్టడం సబబుగా లేదని డిమాండ్ చేశారు.జిల్లా నాయకుల సమీక్ష.ఈ కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షులు కె. మల్లేశం, జిల్లా కార్యదర్శి కె. యశోద, ఉపాధ్యక్షులు యాదగిరి, కె. కవిత, మెదక్ పట్టణ అధ్యక్షులు శ్రీదేవి, మున్నా, ఇతర నాయకులు పాల్గొన్నారు.
కె. యశోద, జిల్లా కార్యదర్శి

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.