📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశద్రోహం-కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిరసన దీక్ష

మహాత్మా గాంధీ పేరును తొలగించడం దేశద్రోహం-కేంద్ర బీజేపీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నిరసన దీక్ష

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి, డిసెంబర్‌21(మనప్రజాప్రతినిధి)
పనికి ఆహార పథకం పేరులో నుంచి జాతిపిత మహాత్మా గాంధీ పేరు తొలగించిన కేంద్ర బీజేపీ ప్రభుత్వ చర్యలను నిరసిస్తూ సంగారెడ్డి పట్టణ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గంజి మైదాన్‌లోని గాంధీ విగ్రహం వద్ద ఆదివారం దీక్ష కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా టీజీఐఐసీ చైర్‌పర్సన్ శ్రీమతి నిర్మలా జగ్గారెడ్డి హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మహాత్మా గాంధీ పేరు తొలగించడం వెనుక బీజేపీ ప్రభుత్వం కుట్ర పూరిత రాజకీయాలు చేస్తున్నదని తీవ్రంగా విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం తన జీవితాన్నే త్యాగం చేసిన మహానుభావుడు గాంధీ అని గుర్తు చేశారు.దేశ స్వాతంత్య్ర పోరాటంలో ఒక్క బీజేపీ నాయకుడు కూడా పాల్గొనలేదని, గాంధీ ఆశయాలకు పూర్తిగా విరుద్ధంగా బీజేపీ ప్రభుత్వం గాడ్సే భావజాలంతో పాలన సాగిస్తోందని ఆరోపించారు. గాంధీని అవమానించిన బీజేపీని ప్రజలు ఎప్పటికీ క్షమించరని ఆమె స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ ఆంజనేయులు, టీపీసీసీ కార్యదర్శి తోపాజీ అనంత కిషన్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు జార్జ్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రఘు గౌడ్, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు, బూచి రాములు, కాంగ్రెస్ నాయకులు కూన సంతోష్, బొంగుల రవి, ప్రవీణ్, నర్సింహారెడ్డి, మహేష్, తాహిర్, కసిని రాజు, నవాజ్, ఆరిఫ్, బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.