📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునాగ్సంపల్లి గ్రామంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

నాగ్సంపల్లి గ్రామంలో పూజా కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిజిల్లా.డిసెంబర్21(మనప్రజాప్రతినిధి)
సదాశివపేట మండలంలోని నాగ్సంపల్లి గ్రామంలో నూతనంగా ఎన్నికైన సర్పంచ్ కాశీపురం రవికుమార్ ఆధ్వర్యంలో గ్రామంలోని ఎల్లమ్మ తల్లి మందిరంలో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమానికి సంగారెడ్డి నియోజకవర్గ గౌరవ శాసనసభ్యులు చింతా ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై అమ్మవారిని దర్శించుకుని గ్రామం సుభిక్షంగా, ప్రశాంతంగా ఉండాలని దేవతలను ప్రార్థించారు. గ్రామ ప్రజలను అమ్మవారు ఎల్లవేళలా కాపాడాలని మొక్కుకున్నారు.గ్రామంలోకి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ ప్రవేశించిన సందర్భంగా గ్రామ ప్రజలు పెద్ద ఎత్తున భాజా భజంత్రీలు, డప్పు జప్పులతో ఘన స్వాగతం పలికారు. అనంతరం ఎమ్మెల్యేకు శాలువాలతో సన్మానం నిర్వహించారు. అలాగే సర్పంచ్, ఉపసర్పంచ్, వార్డు సభ్యులను గ్రామ ప్రజల ముందు శాలువాలతో సత్కరించి అభినందనలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ, గ్రామ ప్రజలు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని అందరికీ మేలు జరిగే విధంగా ప్రజాప్రతినిధులు పనిచేయాలని సూచించారు. గ్రామంలో ఏవైనా సమస్యలు తలెత్తినపుడు తన దృష్టికి తీసుకువస్తే వాటిని వీలైనంత త్వరగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని గ్రామ పాలకవర్గం సమక్షంలో హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు పెద్దగోల్ల ఆంజనేయులు, మాజీ గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్, మాజీ ఉపసర్పంచ్ ఆంజనేయులు, గ్రామ శాఖ అధ్యక్షులు కుమ్మరి రమేష్, ఉపసర్పంచ్ ప్రశాంత్, వార్డు సభ్యులు రవి, లత, సుధ, సుమిత్ర, నర్సింలు, మంగమ్మ, నరసింహ గౌడ్, నాయకులు గణేష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.