📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగొర్రెలు–మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమందుద్దెడ గ్రామంలో ప్రారంభించిన సర్పంచ్ మిద్దె శివకుమార్

గొర్రెలు–మేకలకు ఉచిత నట్టల నివారణ కార్యక్రమందుద్దెడ గ్రామంలో ప్రారంభించిన సర్పంచ్ మిద్దె శివకుమార్

📰 Generate e-Paper Clip


మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.డిసెంబర్24
ప్రభుత్వం పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో గొర్రెలు, మేకల ఆరోగ్య పరిరక్షణ కోసం చేపట్టిన ఉచిత నట్టల నివారణ కార్యక్రమం దుద్దెడ గ్రామంలో విజయవంతంగా నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, ఉప సర్పంచ్ పల్లె జానకి యాదగిరి లు అధికారికంగా ప్రారంభించారు. కార్యక్రమాన్ని పశు వైద్యాధికారి శ్రీనివాస్ పర్యవేక్షించారు.ఈ సందర్భంగా గొర్రెల కాపరులతో మాట్లాడిన పశు వైద్యాధికారి శ్రీనివాస్,నట్టల నివారణ జరిగితే గొర్రెలు, మేకల్లో ఆకలి గుణం పెరిగి బాగా మేత తీసుకుంటాయని, ఆరోగ్యంగా పెరిగి అధిక బరువు సాధిస్తాయని తెలిపారు. అలాగే గొర్రె పిల్లల మరణాలు తగ్గి, మాంస ఉత్పత్తి పెరిగి పశుపాలకులకు ఆర్థికంగా లాభం చేకూరుతుందని సూచించారు.కార్యక్రమంలో భాగంగా జీవులకు నట్టల నివారణ మందును తాగించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు ఆంజనేయులు, ఓజయ్య, యాదవ్ కుల అధ్యక్షుడు రాజు, గొర్రెల కాపరులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.