📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమొగుడంపల్లి మండల కేంద్రంలో మేకలు–గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమం ఘనంగా ప్రారంభం

మొగుడంపల్లి మండల కేంద్రంలో మేకలు–గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమం ఘనంగా ప్రారంభం

📰 Generate e-Paper Clip

సంగారెడ్డి.డిసెంబర్23(మనప్రజాప్రతినిధి):
సంగారెడ్డి జిల్లా మొగుడంపల్లి మండల కేంద్రంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు మేకలు, గొర్రెలకు ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తున్నారు. పశు సంపద ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని ఈ నెల డిసెంబర్ 22వ తేదీ నుండి 31వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.మండల కేంద్రంలోని స్థానిక పశు చికిత్స శాలల్లో ఈ కార్యక్రమాన్ని పశు చికిత్స వైద్య అధికారి డాక్టర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో అమలు చేస్తున్నారు. పశువుల్లో నట్టల వల్ల కలిగే అనారోగ్య సమస్యలను నివారించి, రైతులకు ఆర్థికంగా మేలు చేకూర్చడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అధికారులు పేర్కొన్నారు.ఈ ఉచిత నట్టల నివారణ మందు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మొహమ్మద్ మక్సుద్, స్థానిక గ్రామ సర్పంచ్ బి. రాజు, ఉపసర్పంచ్ పి. సంజీవరెడ్డి, మాజీ ఎంపీటీసీ సి. బక్కయ్య హాజరయ్యారు. అదనంగా మొహమ్మద్ ముజామిల్, మల్లన్న, శోకత్, పశు చికిత్స ఓఎస్‌కే శంకర్, పశు మిత్ర కపిల్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ సునీల్ దత్ మాట్లాడుతూ, మేకలు మరియు గొర్రెలకు నట్టల నివారణ మందు వేయడం వల్ల పశువుల ఆరోగ్యం గణనీయంగా మెరుగుపడుతుందని తెలిపారు. ముఖ్యంగా మాంసం పెరుగుదల పెరగడం, జీర్ణ వ్యవస్థ బలపడడం, పశువులు చురుకుగా హుషారుగా ఉండడం వంటి ప్రయోజనాలు కలుగుతాయని వివరించారు.పశు పోషక రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ మేకలు, గొర్రెలకు తగిన మోతాదులో నట్టల నివారణ మందు తప్పకుండా వేయించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా మండల వ్యాప్తంగా పశు సంపద అభివృద్ధి చెందడంతో పాటు రైతుల ఆదాయం పెరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్థానిక మేకలు–గొర్రెల పోషక రైతులు పాల్గొని అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.