📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

మత్స్యకారులు ఆర్థికంగా ఎదగాలి: టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి

📰 Generate e-Paper Clip

సదాశివపేట,డిసెంబర్23(మనప్రజాప్రతినిధి):
మత్స్యకారులు చేపల పెంపకం ద్వారా ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తోందని టీజీఐఐసీ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి అన్నారు.సదాశివపేట పట్టణంలోని ఉభ చెరువులో మంగళవారం స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలిసి చేప పిల్లలను చెరువులో వదిలారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్స్యకారుల జీవనోపాధి మెరుగుపడాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగానే ఉభ చెరువులో చేప పిల్లలను వదిలినట్లు పేర్కొన్నారు.మత్స్య సంపద అభివృద్ధి ద్వారా మత్స్యకార కుటుంబాలకు స్థిరమైన ఆదాయం లభిస్తుందని, వారి జీవన ప్రమాణం మెరుగుపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. మత్స్యకారుల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని, వారి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు.
కార్యక్రమంలో సిడిసి చైర్మన్ గడీల రాంరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ ప్రభు గౌడ్, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కంది కృష్ణ, మున్సిపల్ కమిషనర్ శివాజీ, మత్స్యశాఖ ఏడీ సుదర్శన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ పట్టణ మండల అధ్యక్షులు మునిపల్లి సత్యనారాయణ, చాట్ల సిద్ధన్న పాల్గొన్నారు.అలాగే సర్పంచులు ఒగ్గు శ్రీనివాస్, ఆశి రెడ్డి, షాబుద్దీన్, మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ పిల్లోడి విశ్వనాథం, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు చిరు, రాములు గౌడ్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్ రాయపాడు రమేష్, మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ పట్నం సుభాష్ హాజరయ్యారు.మత్స్య సహకార సంఘం అధ్యక్షుడు చాపల హనుమంతు, కార్యదర్శి నల్ల శంకర్, ఉపాధ్యక్షుడు నల్ల సుధాకర్, డైరెక్టర్లు చాపల అనిల్, నల్ల నర్సింలు, నల్ల శ్రీనివాస్, పెద్ద శంకర్, కాంగ్రెస్ నాయకులు హాజీ, షెజ్జీ, మామిడి రాజు, తుల్జారాం, కొత్త గొల్ల శేఖర్, తుకారం, తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.