📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుముస్లాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఘనంగా ‘పోషణ్ మహా పండగ’

ముస్లాపూర్ ఎంపీపీ ఎస్ పాఠశాలలో ఘనంగా ‘పోషణ్ మహా పండగ’

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మెదక్.డిసెంబర్ 20
మెదక్ జిల్లా అల్లాదుర్గ్ మండలం ముస్లాపూర్ గ్రామంలో ఉన్న మండల ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాలలో ‘పోషణ్ మహా పండగ’ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా విద్యార్థులు తమ తమ ఇళ్ల నుంచి పలు రకాల పోషకాహార వంటకాలను పాఠశాలకు తీసుకువచ్చారు. పిల్లలు స్వయంగా తయారు చేసి తీసుకువచ్చిన వంటకాలను తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు రుచి చూసి చిన్నారులను అభినందించారు.పోషకాహారం వల్ల కలిగే ప్రయోజనాలు, ఆరోగ్యవంతమైన జీవనశైలిపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు ఉపాధ్యాయులు తెలిపారు. విద్యార్థుల ఉత్సాహం, సృజనాత్మకత ఈ కార్యక్రమంలో స్పష్టంగా కనిపించింది.ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మెరీ జోన్స్, ఉపాధ్యాయులు సంధ్యారాణి, యాదగిరి అమ్మ, ఆదర్శ కమిటీ చైర్మన్ పోచమ్మ, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.