📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్వేద మంత్రోచ్ఛారణల మధ్య కేకే భాగ్యలక్ష్మికి అపూర్వ గౌరవం

వేద మంత్రోచ్ఛారణల మధ్య కేకే భాగ్యలక్ష్మికి అపూర్వ గౌరవం

📰 Generate e-Paper Clip

పదవిబాధ్యతలవేళ కేకే భాగ్యలక్ష్మికి వేదాశీస్సులు
అష్టైశ్వర్యాల దీవెనలతో కేకే భాగ్యలక్ష్మి – గ్రామం మొత్తంవాతావరణం
మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.డిసెంబర్20
తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని మేర్లపాక గ్రామం ఈరోజు భక్తి-ఆధ్యాత్మిక శోభతో ఉట్టిపడింది. తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ సతీమణి, ఇటీవల శ్రీకాళహస్తి వ్యవసాయ మార్కెట్ డైరెక్టర్గా నియమితులైన కేకే భాగ్యలక్ష్మికి వేద పండితుల ఆశీర్వాదాలతో ఘన సన్మానం జరిగింది.తిరువల్లూరు నుంచి ప్రత్యేకంగా వచ్చిన వేద పండితులు వేద మంత్రోచ్ఛారణలతో భాగ్యలక్ష్మిని ఆశీర్వదిస్తూ, ఆమె కుటుంబం అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఎల్లప్పుడూ వారి కుటుంబంపై నిలిచివుండాలనిహృదయపూర్వకంగా దీవించారు.ఈ శుభకార్యక్రమంలో భాగ్యలక్ష్మి భర్త కేకే రమణ, గ్రామ పెద్దలు, మహిళలు, యువతతో పాటు టీడీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమం అనంతరం కేకే రమణ వేద పండితులకు గౌరవంగా నగదు రూపంలో గుడిట్రస్ట్‌కు విరాళం సమర్పించారు.ఆధ్యాత్మిక పరిమళంతో, ప్రజాప్రతినిధుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం మేర్లపాక గ్రామంలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భాగ్యలక్ష్మి నియామకానికి మరింత ప్రతిష్ఠను చేకూర్చింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.