📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుధ్యానంతోనే దిశా నిర్దేశం-ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం ఘనంగా వేడుకలు

ధ్యానంతోనే దిశా నిర్దేశం-ప్రపంచ మెడిటేషన్ దినోత్సవం ఘనంగా వేడుకలు

📰 Generate e-Paper Clip

విద్యార్థులవిజయంలోఏకాగ్రతే కీలకం-మెడిటేషన్‌తోనే మానసికబలం
ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డిస్పష్టం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్21
నేటి పోటీ ప్రపంచంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న మానసిక ఒత్తిడి, ఆందోళనలకు ధ్యానం మాత్రమే శాశ్వత పరిష్కారమని ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్), సిద్దిపేట ప్రిన్సిపాల్ సత్యనారాయణ రెడ్డి స్పష్టం చేశారు. ప్రపంచ మెడిటేషన్ దినోత్సవాన్ని పురస్కరించుకొని కళాశాలలో నిర్వహించిన ధ్యాన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.
ధ్యానం ద్వారా మనసుకు అపారమైన ప్రశాంతత, అంతర్లీన శక్తి, ఏకాగ్రత పెరుగుతాయని ఆయన తెలిపారు. విద్యార్థులు లక్ష్య సాధనలో ముందుకు సాగాలంటే రోజువారీ జీవితంలో మెడిటేషన్‌ను ఒక భాగంగా మార్చుకోవాలని సూచించారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ధ్యానం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. వ్యక్తిత్వ వికాసం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం పెరగడంలో మెడిటేషన్ అనివార్యమని వివరించారు.
ఈ సందర్భంగా స్టూడెంట్ కౌన్సిలర్ ఫాతిమా గారు మాట్లాడుతూ, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు సమాజంలో ధ్యాన ప్రాముఖ్యతను విస్తృతంగా చాటాలని పిలుపునిచ్చారు. హార్ట్‌ఫుల్నెస్ ఆధ్వర్యంలో దాజీ నిర్వహిస్తున్న “ఒకే ప్రపంచం-ఒకే హృదయం” మహా ధ్యాన కార్యక్రమంలో రేపు రాత్రి 8 గంటలకు ప్రతి ఒక్కరూ పాల్గొని ప్రపంచ శాంతికి తమ వంతు సహకారం అందించాలని సూచించారు. ప్రతి విద్యార్థి కనీసం రోజుకు 15 నిమిషాలు ధ్యానం చేయడానికి కట్టుబడాలని, అదే వారి భవిష్యత్‌కు బలమైన పునాది అవుతుందని తెలిపారు.విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఉత్సాహంగా పాల్గొని ధ్యాన కార్యక్రమాన్ని శ్రద్ధగా నిర్వహించడం విశేషంగా నిలిచిందని నిర్వాహకులు పేర్కొన్నారు. కళాశాల ప్రాంగణం మొత్తం ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయి, ప్రశాంతతకు ప్రతీకగా మారింది.
ఈ కార్యక్రమంలో స్టూడెంట్ కౌన్సిలర్ కనక చంద్రం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ దరిపల్లి నగేష్, ఏజీఎంసీ దేవయ్య, స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, స్టూడెంట్ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ నంట శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ ఇంచార్జి అశోక్, కోచ్ వెంకటేష్‌తో పాటు అధ్యాపకులు వెంకటరమణ, గంగాధర్, ప్రసాద్, విజయభాస్కర్, రాజశేఖర్, రఘురాజ్, శ్రీకాంత్, నరేందర్ రెడ్డి, బేతి శ్రీనివాస్, సత్యనారాయణ, అఖిల్, రవి, కొమురయ్య, చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.