📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుకంకోల్ గ్రామంలో సర్పంచ్ మమత నాగేష్, ఉప సర్పంచ్ మహమ్మద్ అఫ్సర్‌ల ప్రమాణ స్వీకారం ఘనంగా...

కంకోల్ గ్రామంలో సర్పంచ్ మమత నాగేష్, ఉప సర్పంచ్ మహమ్మద్ అఫ్సర్‌ల ప్రమాణ స్వీకారం ఘనంగా నిర్వహణ

📰 Generate e-Paper Clip

సంగారెడ్డిజిల్లా.డిసెంబర్22(మనప్రజాప్రతినిధి)
సంగారెడ్డి జిల్లా మునిపల్లి మండలం కంకోల్ గ్రామంలో నూతనంగా ఎన్నికైన గ్రామపంచాయతీ పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఘనంగా జరిగింది. ఈకార్యక్రమం గ్రామ పంచాయతీ కార్యదర్శి సంతోష్, మాజీ వైస్ ఎంపీపీ చాంద్ పాషా ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా నూతన సర్పంచ్ మమత నాగేష్, ఉప సర్పంచ్ మహమ్మద్ అఫ్సర్, వార్డు సభ్యులు శ్రీకాంత్, వీరేష్, నవీన్, ఫాతిమాలు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం నూతన ప్రజాప్రతినిధులను శాలువాలతో సత్కరించి ఘనంగా సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ శ్రీశైలం స్వామి, కాంగ్రెస్ నాయకులు ముఖీమ్, రమేష్, జగదీశ్, ప్రభు, శేఖర్ పాల్గొని నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గ్రామాభివృద్ధికి అందరూ సమిష్టిగా కృషి చేయాలని వారు సూచించారు.ప్రమాణ స్వీకార కార్యక్రమంలో గ్రామనాయకులు, గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన సర్పంచ్, ఉప సర్పంచ్‌లకు అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.