📄 ePaper
Sunday, August 30, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

ఇల్లంతకుంట మండలంలో పలు గ్రామాల ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో పాల్గొన్న ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్ 22
ఇల్లంతకుంట మండలంలోని పలు గ్రామపంచాయతీల నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకార కార్యక్రమాల్లో మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన సర్పంచ్‌లు, ఉప సర్పంచ్‌లు, వార్డు సభ్యులకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు.గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుతో గెలుపొందిన సర్పంచ్‌లు విజయం సాధించడం పట్ల సంతోషం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే, గ్రామాల సమగ్ర అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు అంకితభావంతో పని చేయాలని సూచించారు. ప్రజల ఆశలు, ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించాలని, మౌలిక వసతులు, సంక్షేమ కార్యక్రమాల అమలులో ముందుండాలని అన్నారు.గెలిచిన గ్రామ సర్పంచ్‌లకు, వార్డు సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాభివృద్ధిలో ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసికట్టుగా ముందుకు సాగితేనే నిజమైన మార్పు సాధ్యమవుతుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కోమటిరెడ్డి భాస్కర్ రెడ్డి, పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.