📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసైన్యంలో చేరేందుకు యువతకు అగ్నివీర్ స్వర్ణావకాశం

సైన్యంలో చేరేందుకు యువతకు అగ్నివీర్ స్వర్ణావకాశం

📰 Generate e-Paper Clip

ఫిబ్రవరి1నుంచిఏప్రిల్15వరకుఆన్‌లైన్ దరఖాస్తులు-మేజర్ ప్రకాష్ చంద్రరాయ్.
అగ్నిపథ్ ద్వారా యువతకు దేశసేవతోపాటు భవిష్యత్తు భద్రత
మోసపూరిత మధ్యవర్తులను నమ్మవద్దు-యువతకు ఆర్మీ అధికారి హెచ్చరిక
నాయకత్వం,క్రమశిక్షణ పెంపొందించే అగ్నిపథ్ పథకం-మేజర్ ప్రకాష్ చంద్రరాయ్..
సిద్దిపేట,జనవరి31(మనప్రజాప్రతినిధి):
భారత సైన్యంలో చేరాuలనుకునే యువతకు అగ్నివీర్ పథకం ద్వారా దేశసేవకు మార్గం సుగమమవుతుందని ఆర్మీ రిక్రూట్‌మెంట్ మెడికల్ ఆఫీసర్ మేజర్ ప్రకాష్ చంద్రరాయ్ అన్నారు.సిద్దిపేట ప్రభుత్వ జూనియర్ కళాశాల (కో-ఎడ్యుకేషన్)లో శుక్రవారం అగ్నిపథ్ రిక్రూట్‌మెంట్‌పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్ 15 వరకు అగ్నివీర్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు తెలిపారు. యువత ఎలాంటి మోసపూరిత మధ్యవర్తులను నమ్మవద్దని హెచ్చరించారు. అగ్నివీర్‌గా సేవ చేయడం ద్వారా సైనిక క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, శారీరక దృఢత్వం పెంపొందుతాయని, భవిష్యత్తులో ఇతర రంగాల్లో ఉపాధి అవకాశాలకు ఇది బలమైన పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు.అగ్నిపథ్ పథకం కింద అగ్నివీర్‌గా ఎంపికయ్యే విధానం, దరఖాస్తు ప్రక్రియ, అర్హతలు, శారీరక ప్రమాణాలు, వైద్య పరీక్షలు, శిక్షణా కాలం, విధులు, బాధ్యతలు, నాలుగు సంవత్సరాల సేవా కాలం పూర్తయ్యాక అందించే సేవానిధి ప్యాకేజీ, బీమా సదుపాయాలపై ఆయన విద్యార్థులకు సవివరంగా వివరించారు.కళాశాల ప్రిన్సిపల్ సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ, అర్హత కలిగి ఆసక్తి ఉన్న విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ నిబంధనలపై కళాశాల విద్యార్థులు ఇర్ఫాన్ (సీఈసీ), సునీల్ (ఓఏ) ద్వితీయ సంవత్సరం విద్యార్థులు రూపొందించిన ఉత్తమ షార్ట్ ఫిలింకు ట్రాఫిక్ అధికారులు అందించిన సర్టిఫికెట్లను ఆయన చేతుల మీదుగా అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆర్మీ సుబేదార్ యాకూబ్ ఖాన్, కళాశాల స్టాఫ్ సెక్రటరీ సుధాకర్ రెడ్డి, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, స్పోర్ట్స్ ఇన్‌చార్జి అశోక్, ఎన్‌ఎస్‌ఎస్ ప్రోగ్రాం అధికారి దరిపల్లి నగేష్, స్టూడెంట్ కౌన్సిలర్ ఫాతిమా, అధ్యాపకులు రఘురాజ్, వెంకటరమణ, గంగాధర్, రాజ్యలక్ష్మి, నరేందర్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, శ్రీకాంత్, సత్యనారాయణ,విజయ భాస్కర్, చక్రవర్తి, రవి, బేతి శ్రీనివాస్, పి. శ్రీకాంత్, అఖిల్,కొమురయ్య తదితరులు పాల్గొన్నారు.
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.