📄 ePaper
Wednesday, September 2, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుమంగలపల్లిలో ‘అరైవ్ అలైవ్’: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

మంగలపల్లిలో ‘అరైవ్ అలైవ్’: రోడ్డు భద్రతపై పోలీసుల అవగాహన

📰 Generate e-Paper Clip

రోడ్డు భద్రతపైగ్రామస్తులకు,వాహనదారులకు సూచనలు చేసిన ఎస్సై ప్రశాంత్ రెడ్డి

మనప్రజాప్రతినిధి//రాజన్నసిరిసిల్ల.జనవరి16
రోడ్డు ప్రమాదాల నివారణే లక్ష్యంగా పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘అరైవ్ అలైవ్’ (ARRIVE ALIVE) కార్యక్రమంలో భాగంగా గురువారం కోనరావుపేట మండలం మంగలపల్లి గ్రామంలో రోడ్డు భద్రతా అవగాహన సదస్సు నిర్వహించారు.ఎస్సై కే. ప్రశాంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామస్తులు, వాహన దారులకు ట్రాఫిక్ నిబంధనలపై విస్తృత అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి వాహనదారుడు స్వీయ రక్షణను బాధ్యతగా భావించాలని సూచించారు.ద్విచక్ర వాహనదా రులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ప్రమాద సమయంలో అది ప్రాణరక్షణగా నిలుస్తుందని తెలిపారు. మత్తులో వాహనాలునడపడం వల్ల తమ ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలను కూడా ప్రమాదంలో పడేసిన వారవుతారని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ మైనర్ పిల్లలకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వకూడదని, ఇది చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు.రోడ్డు ప్రయాణంలో ఫోన్ మాట్లాడటం వంటి నిర్లక్ష్యపు చర్యలకు దూరంగా ఉండాలని, ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ట్రాఫిక్ నిబంధ నలు పాటించడం ద్వారానే సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవ చ్చని ఎస్సై తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.