📄 ePaper
Wednesday, September 2, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగ్రూప్–3,గ్రూప్–2,సీఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో ఇరుకోడు యువత సత్తా...

గ్రూప్–3,గ్రూప్–2,సీఆర్పీఎఫ్ ఉద్యోగాల్లో ఇరుకోడు యువత సత్తా…

📰 Generate e-Paper Clip

ప్రభుత్వఉద్యోగాల్లో ఇరుకోడు గ్రామానికి గర్వకారణమైన విజయాలు
మనప్రజాప్రతినిధి//సిద్దిపేట నియోజకవర్గం.జనవరి16
ఇటీవల వెలువడిన గ్రూప్–3, గ్రూప్–2, సీఆర్పీఎఫ్ ఉద్యోగాల ఫలితాల్లో ఇరుకోడు గ్రామ యువకులు తమ ప్రతిభతో రాష్ట్రస్థాయిలో ప్రత్యేక గుర్తింపు సాధించారు. గ్రామానికి చెందిన దుంపటి దినేష్ గ్రూప్–3 ద్వారా ఎండోమెంట్ శాఖలో ఉద్యోగం పొందగా, వాసూరి రాకేష్ గ్రూప్–2 ద్వారా ల్యాండ్ సర్వేయర్‌గా ఎంపికయ్యారు. అలాగే వాసూరి శ్రీనివాస్ దేశ సేవే ధ్యేయంగా సీఆర్పీఎఫ్ జవాన్‌గా ఎంపికయ్యారు.ప్రతిష్టాత్మక ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాలు సాధించి, గ్రామ గౌరవాన్ని రాష్ట్రస్థాయిలో నిలబెట్టిన ఈ ముగ్గురు యువకులు నేటి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నారని గ్రామస్తులు కొనియాడారు.
ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ గణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వలు యువకులను శాలువాలతో ఘనంగా సత్కరించి, పుష్పగుచ్ఛాలు అందజేసి హృదయపూర్వక అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో వార్డు మెంబర్లు బందారంపర్శరాములు, వాసూరి శేఖర్, గణపురం రమేష్, దుబాయ్ (కత్తి) శ్రీను, వెలుగు సీఏ కొడారి నరసింహారెడ్డి, వాసూరి స్వామి.శిర్ర పర్శరాములు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.ఉద్యోగాలు సాధించి న ఈ ముగ్గురు యువకులు కురుమ కులానికి చెందినవారు కావడం విశేషం. ఈ సందర్భంగా గౌరవ మాజీ సుడా చైర్మన్ మా రెడ్డి రవీందర్ రెడ్డి గారు యువకులకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.