📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసూరారం గ్రామానికి అండగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ – కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల...

సూరారం గ్రామానికి అండగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ – కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ

📰 Generate e-Paper Clip

•ఎమ్మెల్యే చింతప్రభాకర్ చేతుల మీదుగా కళ్యాణ్ లక్ష్మి–షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ
సదాశివపేట,జనవరి20(మనప్రజాప్రతినిధి)
ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ముందుకుసాగుతున్న ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మరోసారి తన సేవాభావాన్ని చాటారు. సంగారెడ్డి పట్టణంలోని పీఎస్ఆర్ గార్డెన్‌లో మంగళవారం నిర్వహించిన కార్యక్రమంలో, ఆయన చేతుల మీదుగా సూరారం గ్రామానికి చెందిన ఐదుగురు లబ్ధిదారులకు కళ్యాణ్ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమాన్ని సూరారం మాజీ కో–ఆప్షన్ మెంబర్ సలవుద్దిన్ ఆధ్వర్యంలో నిర్వహించారు.ఈ సందర్భంగా మాజీ కో–ఆప్షన్ మెంబర్ సలవుద్దిన్ మాట్లాడుతూ,“ఎమ్మెల్యే చింత ప్రభాకర్ అన్న ఉన్నంతవరకు మాకు ఎలాంటి ఇబ్బందులు లేవు. మేము ఏది అడిగినా కాదనకుండా, సూరారం గ్రామ అభివృద్ధికి అడుగడుగునా తోడుగా నిలిచిన నాయకుడు ఆయనే” అని అన్నారు. సూరారం గ్రామ ప్రజల తరపున ఎమ్మెల్యేకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ మైనార్టీ మండల అధ్యక్షులు నిజాముద్దీన్, పార్టీ ఉపసర్పంచ్ హైమద్, ఎలియాస్, వార్డు సభ్యులు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.