📄 ePaper
Sunday, August 30, 2026
Homeఆంధ్రప్రదేశ్శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక దర్శనం

శ్రీ పరశురామేశ్వర స్వామి ఆలయ ప్రత్యేక దర్శనం

📰 Generate e-Paper Clip

ఎమ్మెల్సీ బీద రవిచంద్ర కుటుంబ సభ్యులతో కలిసి స్వామి సేవలో పాల్గొనడం.

మనప్రజాప్రతినిధి//ఏర్పేడు మండలం.జనవరి12నెల్లూరుఎమ్మెల్సీ బీద రవిచంద్ర తమ కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ పరశురామేశ్వర ఆలయంలో ప్రత్యేక దర్శనం చేసుకుని స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ బత్తల గిరి నాయుడు, కార్యనిర్వహణాధికారి, అర్చకులు ఎన్. వంశికృష్ణ శర్మ, పి. యోగేంద్ర కుమార్ శర్మలు ఎమ్మెల్సీ కుటుంబాన్ని సాదరంగా స్వాగతించి తీర్థప్రసాదాలతో సత్కరించారు.ఈ కార్యక్రమంలో ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షుడు పేరం నాగారాజు నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ చైర్మన్ రెడ్డివారి గురువారెడ్డి, ఏర్పేడు మండల బీసీసీ సెల్ అధ్యక్షుడు దుర్గిపేరీ మునయ్య తదితర స్థానిక నేతలు పాల్గొన్నారు.అలాగే ఆలయంలో కొనసాగుతున్న అభివృద్ధి పనులపై ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆసక్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భం గా ఆలయ చైర్మన్, కార్యనిర్వహణాధికారి వివరించిన సమాచారం మేరకు 2026 ఏప్రిల్ 23న శ్రీ పరశురామేశ్వర ఆలయంలో మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.ప్రస్తుతం పాడైపోయిన ధ్వజస్తంభం స్థానంలో నూతన ధ్వజస్తంభం నిర్మాణానికి కావాల్సిన ఖర్చును ఎమ్మెల్సీ బీద రవిచంద్ర స్వయంగా భరిస్తానని ప్రకటించడం విశేషం.ఈ సేవా కార్యక్రమం ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యాల మెరుగుదలకు దోహదపడే ఒక కీలక ముందడుగుగా నిలిచిందని భక్తులు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.