📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుతెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం సిద్దిపేట జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం సిద్దిపేట జిల్లా క్యాలెండర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

డీఐఈఓ కార్యాలయంలో క్యాలెండర్ ఆవిష్కరణ… ప్రభుత్వ కళాశాలల బలోపేతంపై చర్చ

ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలి: డీఐఈఓ రవీందర్ రెడ్డి
సిద్దిపేటనియోజకవర్గం.మనప్రజాప్రతినిధి//జనవరి19
సిద్దిపేట జిల్లా తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం క్యాలెండర్‌ను జిల్లా డీఐఈఓ రవీందర్ రెడ్డి సోమవారం డీఐఈఓ కార్యాలయంలో అధికారికంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా డీఐఈఓ రవీందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల బలోపేతానికి అధ్యాపకులు అంకితభావంతో పనిచేయాలని సూచించారు. సిద్దిపేట జిల్లాను ఉత్తమ ఫలితాలతో రాష్ట్రంలో ముందు వరుసలో నిలపాలని, ప్రభుత్వ కళాశాలల విద్యార్థుల్లో పోటీ తత్వం పెరిగేలా తీర్చిదిద్దాలని అన్నారు.ప్రభుత్వ కళాశాలల్లో డిజిటల్ తరగతుల నిర్వహణతో పాటు నూతన విద్యా సంస్కరణలు అమలు చేస్తున్నామని, అడ్మిషన్లు పెంచే దిశగా ఇప్పటినుంచే ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలిపారు. రాబోయే పరీక్షలకు విద్యార్థులు భయాందోళనకు గురి కాకుండా ఒకటికి రెండు సార్లు ప్రాక్టీస్ చేయించి, ధైర్యంగా పరీక్షలు రాసేలా సిద్ధం చేయాలని అధ్యాపకులకు సూచించారు.అనంతరం ప్రముఖ దంత వైద్య నిపుణులు డాక్టర్ శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ, ప్రభుత్వ కళాశాలల్లో చదువుతున్న విద్యార్థుల కోసం దంత వైద్య శిబిరాలు నిర్వహించామని తెలిపారు. భవిష్యత్తులో అన్ని ప్రభుత్వ కళాశాలల్లో దంత వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి పేద విద్యార్థులకు ఉచిత సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ సంఘం అధ్యక్షులు శ్రీనివాస్, తెలంగాణ గెజిటెడ్ అధ్యాపకుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు కనక చంద్రం, రాష్ట్ర ప్రచార కార్యదర్శి నాగేందర్, రాష్ట్ర అధికార ప్రతినిధి నంటా శ్రీనివాస్ రెడ్డి, సిద్దిపేట జిల్లా అధ్యక్షులు గిరి రవి, జిల్లా ప్రధాన కార్యదర్శి దరిపల్లి నగేష్, మహిళా కార్యదర్శి రమాదేవి, రాష్ట్ర నాయకులు వనజ రెడ్డి, అశోక్, అసోసియేట్ ప్రెసిడెంట్ శ్రీధర్, వర్కింగ్ ప్రెసిడెంట్ పంజా గంగాధర్, శ్రీనివాస్ రెడ్డి, విద్యాసాగర్, జిల్లా నాయకులు శ్రీనివాసరాజు, అధ్యాపకులు వెంకటేశ్వర్లు, వీరయ్య, దయానంద్, వెంకటరమణ స్వామి, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.