📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసిరిసినగండ్లలో గ్రామస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభం

సిరిసినగండ్లలో గ్రామస్థాయి సీఎం కప్ క్రీడా పోటీల ప్రారంభం

📰 Generate e-Paper Clip

క్రీడలతో మానసిక–శారీరక వికాసం సాధ్యం:డీఈఓ శ్రీనివాస్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//కొండపాక మండలం.జనవరి21
కొండపాక మండలంలోని సిరిసినగండ్ల గ్రామంలో గ్రామస్థాయి సీఎం కప్ క్రీడా పోటీలను డీఈఓ శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారుల ను గుర్తించి ప్రోత్సహించేందుకు సీఎం కప్ క్రీడా పోటీలు ఎంతో ఉపయోగపడతాయని తెలిపారు.విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలని సూచించిన ఆయన, క్రీడలుమానసికంగా, శారీరకంగా సంపూర్ణ వికాసానికి దోహదపడతాయని అన్నారు. క్రీడల్లో గెలుపు–ఓటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తిని పాటిస్తూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వెంకటేశ్వర్లు, ఎంఈఓ శ్రీ శ్రీనివాస రెడ్డి, గ్రామ సర్పంచ్ యాదవ్వ, ఉప సర్పంచ్ కర్ణాకర్, గ్రామ సెక్రటరీ స్వాతి, వార్డు సభ్యులు, పాఠశాల ఉపాధ్యాయ బృందం, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.