📄 ePaper
Saturday, August 29, 2026
Homeఆంధ్రప్రదేశ్యువ నేత, ప్రజా సేవకుడు:నారా లోకేష్ పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమం

యువ నేత, ప్రజా సేవకుడు:నారా లోకేష్ పుట్టినరోజు ప్రత్యేక కార్యక్రమం

📰 Generate e-Paper Clip

నారా లోకేష్ జన్మదిన సందర్భంగా…యాచకులకు బట్టల పంపిణీ,యువతకు స్ఫూర్తి
మనప్రజాప్రతినిధి//శ్రీకాళహస్తి నియోజకవర్గం.జనవరి23
శుక్రవారం, జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి మరియు యువగళం పాదయాత్ర స్ఫూర్తిదాత, రాష్ట్ర విద్య మరియు ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీకాళహస్తి ఆలయం ముందు యాచకులకు వస్త్రదానం కార్యక్రమం ఘనంగా నిర్వహించ బడింది.ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర అధికార ప్రతినిధి, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రెడ్డివారి గురవారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించి యాచకులకు పంచ్ టవెల్స్ అందజేశారు.ఈ సందర్భంగా గురవారెడ్డి మాట్లాడుతూ, “రాష్ట్రంలో విద్య మరియు ఐటీ శాఖ మంత్రిగా ఉండి నారా లోకేష్ నిరంతరం ప్రజల, యువత భవిష్యత్తుకు కృషి చేస్తున్నారు. పెట్టుబడిదారులను ఒప్పించి, లక్షలాది కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రంలో ప్రవేశపెట్టి యువతకు అవకాశాలు సృష్టించడం గర్వకారణం. జన్మదిన సందర్భంగా వారికి శ్రీకాళహస్తి ఈశ్వర, వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, ప్రజల ఆశీర్వాదాలు కుదిరాలని కోరుతున్నాము” అన్నారు.గురవారెడ్డి అదనంగా చెప్పినారు, “నారా లోకేష్ బాబు పాదయాత్రల ద్వారా ప్రజల కష్టాలను తెలుసుకుని ప్రభుత్వ పథకాలను త్వరితంగా అమలు చేయడం శుభ పరిణామం. ఈ పుట్టినరోజు ద్వారా వారికి నిండు నూరేళ్ల ఆయురారోగ్యం, రాష్ట్ర ప్రజల సేవలో స్థైర్యం, ధైర్యం లభించాలని దేవుని ప్రార్థిస్తున్నాము” అని తెలిపారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర వన్నెకుల క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ మిన్నల్ రవి, రాష్ట్ర గిరిజన సలహా మండల సభ్యులు, పార్లమెంట్ ఎస్టీ అధ్యక్షులు సుబ్బయ్య, రాష్ట్ర బీసీ పార్టీ కార్యనిర్వా హక కార్యదర్శి ఉమేష్ రావు, తొట్టంబేడు సింగిల్ విండో అధ్యక్షులు భాస్కర్ ముదిరాజ్, తొట్టంబేడు మండల ప్రధాన కార్యదర్శి సుబ్రహ్మణ్యం, పార్లమెంట్ యువత అధికార ప్రతినిధి రాఘవల యాదవ్, నియోజకవర్గ బీసీ సెల్ అధ్యక్షులు దొరై రాజు రెడ్డి, శ్రీకాళహస్తి మండల బీసీ సెల్ అధ్యక్షులు ఎక్స్ సర్పంచ్ ఈశ్వర్ రెడ్డి, టిడిపి నేతలు సోమశేఖర్ యాదవ్, తేజ్ రెడ్డి, పట్టాభి తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.