📄 ePaper
Thursday, August 27, 2026
Homeతెలంగాణ10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భణాపూర్ రాజు ఎన్నికల ప్రచారం

10వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి భణాపూర్ రాజు ఎన్నికల ప్రచారం

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 4:
నారాయణఖేడ్ మున్సిపాలిటీ 10వ వార్డు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భణాపూర్ రాజు వార్డులో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిసి ఆశీర్వాదం కోరారు. తాగునీరు, అంతర్గత రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, పారిశుధ్యం వంటి సమస్యలకు ప్రాధాన్యత ఇస్తానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ ప్రజల సంక్షేమమే లక్ష్యంగా పనిచేస్తోందని పేర్కొన్నారు. ఒక్క అవకాశం ఇస్తే 10వ వార్డును అభివృద్ధి దిశగా తీసుకెళ్లి, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉండే ప్రతినిధిగా పనిచేస్తానని తెలిపారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.