📄 ePaper
Monday, August 24, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఉచిత బాల హృదయ శస్త్రచికిత్సలు ప్రారంభం

ఉచిత బాల హృదయ శస్త్రచికిత్సలు ప్రారంభం

📰 Generate e-Paper Clip

పేదచిన్నారులకు ప్రాణరక్షక హృదయ చికిత్స పూర్తిగాఉచితం కొండపాక సంజీవని కేంద్రంలో ఫిబ్రవరి17నుండి సేవలు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.ఫిబ్రవరి13
శ్రీ సత్య సాయి సంజీవని బాల హృదయ వైద్య & పరిశోధనా కేంద్రంలో ఫిబ్రవరి 17,2026 నుండి చిన్నారుల కోసం పూర్తిగా ఉచిత బాల హృదయ శస్త్రచికిత్సలు ప్రారంభం కానున్నాయి. జన్మతః హృదయ లోపాలు (పుట్టుకతో వచ్చే హృదయ లోపాలు.సిహెచ్ డి) మరియు ఇతర బాల హృదయ సంబంధిత వ్యాధులతో బాధపడుతు న్న పిల్లలకు ఈ ఆసుపత్రి ప్రత్యేక వైద్య సేవలు అందించనుంది. ఆసుపత్రిలో అందించే శస్త్రచికిత్సలు, పరీక్షలు, మందులు, వసతి. భోజనం వంటి అన్ని సేవలు పూర్తిగా ఉచితంగా అందించబడతాయి. ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఎటువంటి చిన్నారి కూడా ప్రాణ రక్షక చికిత్సకు దూరం కాకూడదనే లక్ష్యంతో ఈ సేవలు ప్రారంభిస్తున్నట్లు ఆసుపత్రి ప్రతినిధులు తెలిపారు.ప్రపంచవ్యాప్తంగా జన్మతః హృదయ లోపాలు ఎక్కువగా కనిపించే వ్యాధులలో ఒకటిగా ఉండగా, సమయానికి గుర్తించి సరైన చికిత్స అందిస్తే చిన్నారుల ప్రాణాలను సులభంగా కాపాడవచ్చని వైద్యులు సూచించారు. తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల పిల్లలకు కూడా ఈ కేంద్రం సేవలు అందించ నుంది.హృదయ సంబంధిత సమస్యల లక్షణాలు కనిపిస్తున్న చిన్నారుల తల్లిదండ్రులు ఆలస్యం చేయకుండా వెంటనే పరీక్షలు చేయించుకోవాలని వైద్యులు కోరారు.
సంప్రదించవలసిన నంబర్: 8010119000
వాట్సాప్:70751 37733

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.