📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుదుద్దెడ శంభు దేవాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

దుద్దెడ శంభు దేవాలయంలో కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా

📰 Generate e-Paper Clip

•ప్రత్యేక పూజలు, కేక్ కట్ – బిఆర్ఎస్ శ్రేణుల భారీ సమక్షంలో సంబురాలు
కొండపాకమండలం(మనప్రజాప్రతినిధి):ఫిబ్రవరి17
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రదాత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు 72వ జన్మదినాన్ని పురస్కరించుకుని భారత రాష్ట్ర సమితి పార్టీ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్ ఆధ్వర్యంలో దుద్దెడ శంభు దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వెలికట్ట చౌరస్తాలోకి చేరుకున్న వందలాది మంది బిఆర్ఎస్ శ్రేణుల మధ్య కేక్ కట్ చేసి కేసీఆర్ జన్మదిన సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు నూనె కుమార్, రైతుబంధు మాజీ కన్వీనర్ ర్యాగళ్ల దుర్గయ్య, సీనియర్ నాయకులు అనంతల ప్రశాంత్, మాజీ ఎంపీపీ బొద్దుల కనకయ్య, మాజీ పిఎసిఎస్ చైర్మన్ మంచాల శ్రీనివాస్‌లు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి, పది సంవత్సరాల పాలనలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి సబ్బండ వర్ణాల సంక్షేమం కోసం ఎనలేని కృషి చేసిన కేసీఆర్‌కు దుద్దెడ శంభు దేవునిఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షించారు.ఇంకా రెండు సంవత్సరాల్లో బిఆర్ఎస్ పార్టీ మళ్లీ అధికారంలోకి వచ్చి కేసీఆర్ మూడోసారి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని కోరుకుంటున్నామని తెలిపారు.ఈ కార్యక్రమంలో కొండపాక మండల వ్యాప్తంగా అన్ని గ్రామాల సర్పంచులు, ఉపసర్పంచులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.