📄 ePaper
Thursday, November 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

నేరాల నియంత్రణలో సీసీ కెమెరాలు కీలకం

📰 Generate e-Paper Clip

“ఒక కెమెరా 100 మంది పోలీసులతో సమానం
వెలికట్టలో 23 సీసీ కెమెరాల ప్రారంభోత్సవంలో అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం12
ప్రజల రక్షణకు, నేరాల నియంత్రణకు, నేరస్తులను గుర్తించి పట్టుకోవడానికి సీసీ కెమెరాలు కీలక పాత్ర పోషిస్తాయని అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మీ పెరుమాళ్ పిలుపు మేరకు సురక్ష నేత్ర ప్రాజెక్టులో భాగంగా ప్రతి గ్రామంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.
ఈ మేరకు బుధవారం కొండపాక మండలంలోని వెలికట్ట గ్రామంలో సర్పంచ్ మానస సురేందర్ రావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 23 సీసీ కెమెరాలను అడిషనల్ డీసీపీ సుభాష్ చంద్రబోస్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా గజ్వేల్ ఏసీపీ నరసింహులు, తొగుట సీఐ శ్రీను మాట్లాడుతూ గ్రామాల్లో సీసీ కెమెరాల ఏర్పాటు వల్ల నేరాలు, అసాంఘిక కార్యకలాపాలను నియంత్రించవచ్చన్నారు. ఒక సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానమని పేర్కొన్నారు. దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడంతో పాటు నేరాల నివారణకు కెమెరాల నిఘా ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. గ్రామంలో ప్రశాంత వాతావరణం నెలకొనేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు.
యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
ప్రస్తుతం యువత డ్రగ్స్, గంజాయి వంటి మాదకద్రవ్యాలకు ఆకర్షితులవుతున్నారని, వాటి వల్ల వ్యక్తిగత జీవితాలతో పాటు కుటుంబాలు కూడా చిన్నాభిన్నమవుతున్నాయని పోలీసు అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. యువత డ్రగ్స్, బెట్టింగ్, ఆన్‌లైన్ గేమింగ్ వంటి వ్యసనాలకు దూరంగా ఉండాలని సూచించారు.
సైబర్ నేరాల బారినపడి డబ్బులు కోల్పోతే వెంటనే 1930 నంబర్‌కు ఫోన్ చేయాలని, తద్వారా మోసపోయిన నగదును నిలిపివేసే అవకాశం ఉంటుందని తెలిపారు. గ్రామంలో ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు జరిగినా 100 నంబర్‌కు సమాచారం అందించాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని భరోసా ఇచ్చారు.
మద్యం సేవించి వాహనాలు నడపడం, అతివేగంతో ప్రయాణించడం వల్ల ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కారులో ప్రయాణించేవారు సీటు బెల్టు పెట్టుకోవాలని సూచించారు. పిల్లల ప్రవర్తనను తల్లిదండ్రులు ఎప్పటికప్పుడు గమనిస్తూ, వారు చెడు అలవాట్లకు దూరంగా ఉండేలా చూడాలని కోరారు.
గ్రామ భద్రతే మా ప్రథమ ప్రాధాన్యం
అనంతరం గ్రామ సర్పంచ్ మానస సురేందర్ రావు మాట్లాడుతూ పోలీసు శాఖ సూచనల మేరకు గ్రామ రక్షణ, నేరాల నియంత్రణ లక్ష్యంగా గ్రామంలో 23 సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వీటి ద్వారా గ్రామంలో ఎక్కడ ఏం జరుగుతుందో నిరంతరం పర్యవేక్షించడంతో పాటు ముందస్తు జాగ్రత్తలు తీసుకునేందుకు అవకాశం ఉంటుందన్నారు.
సీసీ కెమెరాల ఏర్పాటుకు ఆర్థికంగా సహకరించిన ఐ ఫామ్ కంపెనీ, స్వాతి జిన్నింగ్ మిల్ యాజమాన్యాలతో పాటు వెలికట్ట గ్రామానికి చెందిన ఎన్నారై గూడ నరేందర్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని పోలీసు శాఖ కఠినంగా వ్యవహరించాలని, చెడు అలవాట్లకు బానిసలవుతున్న యువతను సరైన మార్గంలో నడిపించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. యువత మంచి మార్గంలో నడిస్తేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ విరూపాక శ్రీనివాస్ రెడ్డి, డైరెక్టర్లు, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మంచాల కనకరాములు, వివిధ గ్రామాల సర్పంచులు, వెలికట్ట ఉపసర్పంచ్, పాలకవర్గ సభ్యులు, పంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.