📄 ePaper
Tuesday, November 10, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఆపదలో అండగా ఉంటా.. అధైర్యపడొద్దు

ఆపదలో అండగా ఉంటా.. అధైర్యపడొద్దు

📰 Generate e-Paper Clip

“బాధితకుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పిన మాజీ సుడా చైర్మన్ మారెడ్డిరవీందర్ రెడ్డి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్10
సిద్దిపేటజిల్లా రూరల్ మండల పరిధిలోని ఇర్కోడ్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మృతి చెందిన తోడేటి యాదగిరి (59), తండ్రి లక్ష్మీనారాయణ యాదగిరి కుమారుడు రాజు కుటుంబాన్ని అలాగే గురువారం మెరుగైన వైద్యం కోసం యశోదహాస్పిటల్ కి వెళుతున్న క్రమంలో మార్గ మద్యలోనే ప్రాణాలు కోల్పోయిన గ్రామానికి చెందిన కుచ్చుల మౌనిక (29), భర్త సురేష్ కుటుంబాన్ని మాజీ సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్ రెడ్డి పరామర్శించి ఆర్ధిక సహాయం చేసారు.
తోడేటి యాదగిరి మృతితో విషాదంలో ఉన్న కుటుంబ సభ్యులను కలిసి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం కుచ్చుల మౌనిక కుటుంబాన్ని పరామర్శించి ఆమెకు ముగ్గురు చిన్నారులు ఉన్న నేపథ్యంలో కుటుంబ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ముగ్గురు పిల్లల భవిష్యత్తు విషయంలో ఆందోళన చెందవద్దని భరోసా ఇచ్చారు.
ఈ సందర్భంగా మారెడ్డి రవీందర్ రెడ్డి మాట్లాడుతూ.. కష్టకాలంలో ఎవరూ అధైర్యపడకూడదని, గుండె ధైర్యంతో, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని సూచించారు. భవిష్యత్తులో ఏ అవసరం వచ్చినా తనను సంప్రదించాలని, బాధిత కుటుంబాలకు అండగా ఉంటానని భరోసా కల్పించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ ఘణపురం కృష్ణ, ఉపసర్పంచ్ బొప్పిడి రాజవ్వ, వార్డు సభ్యులు, మాజీ ఎంపీటీసీ చిట్యాల సత్యనారాయణ, బొర్ర రాజబాబు, గ్రామ మాజీ బీఆర్ఎస్ నాయకులు చల్ల ఎల్లారెడ్డి, విజేందర్ రెడ్డి, వాసూరి స్వామి, బొప్పిడి శ్రీను, మారెడ్డి మధుసూదన్ రెడ్డి, కుంభం సురేష్, బాల్ రెడ్డి, ముదిరాజ్ కమ్యూనిటీ సంఘం నాయకులు, సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.