📄 ePaper
Tuesday, November 10, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుచిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న సీపీ రష్మి పెరుమాళ్

చిన్నారులతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్న సీపీ రష్మి పెరుమాళ్

📰 Generate e-Paper Clip

“అనాథ చిన్నారుల మధ్య వెలుగులు నింపిన సీపీ.. ఆత్మీయంగా దీపావళి వేడుకలు
“అనాథాశ్రమ చిన్నారులకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నుల పంపిణీ
“మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్10
దీపావళి పండుగను పురస్కరించుకుని సిద్దిపేట జిల్లా పోలీస్ కమిషనర్ రష్మి పెరుమాళ్ అనాథాశ్రమ చిన్నారులతో కలిసి పండుగ వేడుకలను ఆనందోత్సాహాల మధ్య జరుపుకున్నారు.
మండల కేంద్రంలోని నిశాంత్ ఆనంద బాలసదన్ అనాథాశ్రమాన్ని సందర్శించిన సీపీ రష్మి పెరుమాళ్ చిన్నారులతో ఆత్మీయంగా ముచ్చటిస్తూ వారితో కలిసి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పిల్లలకు స్వీట్లు, నోట్‌బుక్స్, పెన్నులు అందజేసి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
అనంతరం ఆశ్రమంలోని చిన్నారుల సమస్యలు, వారికి అవసరమైన సౌకర్యాల గురించి అడిగి తెలుసుకున్నారు. పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తగిన చర్యలు తీసుకుంటామని, పోలీస్ శాఖ తరఫున ఎల్లప్పుడూ అండగా ఉంటామని సీపీ భరోసా ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బాలసదన్ నిర్వాహకులు, ఇన్‌స్పెక్టర్లు లతీఫ్, తొగుట సీఐ శ్రీను, కుకునూరుపల్లి ఎస్‌ఐ బాలకృష్ణ, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.