📄 ePaper
Tuesday, November 10, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలురూ.12 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతి

రూ.12 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతి

📰 Generate e-Paper Clip

“దీపావళి పూజ అనంతరం మూతపడిన షాపులో అగ్నిప్రమాదం
బాధితుడిని పరామర్శించిన ఎంపీ మాధవనేని రఘునందన్ రావు
మనప్రజాప్రతినిధి//కొండపాకమండలం.నవంబర్10
సిద్దిపేటజిల్లా కుకునూరుపల్లి మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహ బైక్ సర్వీసెస్ అండ్ ఆటోమొబైల్ షాపులో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో షాపులోని సామగ్రి మొత్తం అగ్నికి ఆహుతి కాగా, సుమారు రూ.12 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితుడు తెలిపాడు.
వివరాల్లోకి వెళితే.. దీపావళి పండుగ సందర్భంగా ఆదివారం షాపులో యజమాని భువనగిరి చందు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం షాపును మూసివేసి ఇంటికి వెళ్లారు. మరుసటి రోజు ఉదయం ఓ వ్యక్తి ఫోన్ చేసి షాపు నుంచి పొగలు వస్తున్నాయని సమాచారం అందించడంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. అప్పటికే షాపు వెనుక భాగం నుంచి మంటలు వ్యాపించి షాపు మొత్తం దగ్ధమవుతోంది. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించినప్పటికీ, అగ్నిమాపక వాహనం చేరుకునేలోపే షాపులోని సామగ్రి పూర్తిగా కాలిపోయినట్లు బాధితుడు వాపోయాడు.
ఈ అగ్నిప్రమాదంలో ఆటోమొబైల్ విడిభాగాలు, బైక్ మెకానిక్ పనిముట్లు, వివిధ పరికరాలు, కంప్రెషర్ యంత్రం, వెల్డింగ్ యంత్రం, కటింగ్ యంత్రం, బోల్ట్ ఆపరేటర్, వాటర్ ప్రెజర్ పరికరాలు తదితర సామగ్రి పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.12 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు బాధితుడు పేర్కొన్నాడు.
బాధితుడి ఫిర్యాదు మేరకు కుకునూరుపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు.
బాధితుడికి ఎంపీ పరామర్శ..
బైక్ సర్వీస్ సెంటర్ అగ్నిప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన విషయం తెలుసుకున్న మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందన్ రావు బాధితుడు భువనగిరి చందును పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితుడికి ధైర్యం చెప్పి, జరిగిన నష్టంపై ఆరా తీశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వం తరఫున తగిన సహాయం అందేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.