📄 ePaper
Thursday, November 12, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుసీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ శ్రేణుల సమాయత్తం

సీఎం రేవంత్ రెడ్డి సభకు కాంగ్రెస్ శ్రేణుల సమాయత్తం

📰 Generate e-Paper Clip

“ఈనెల19న సిద్దిపేటలో భారీ బహిరంగ సభ..సభా స్థలాన్ని పరిశీలించిన కాంగ్రెస్ నాయకులు ప్రజలకు అసౌకర్యం కలగకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులకు విజ్ఞప్తి
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.నవంబర్12
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 19వ తేదీన సిద్దిపేటలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సన్నద్ధమవుతున్నాయి. ఈ నేపథ్యంలో సభను విజయవంతంగా నిర్వహించేందుకు నాయకులు క్షేత్రస్థాయిలో ఏర్పాట్లపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, నాయకురాళ్లు, రెవెన్యూ అధికారులతో కలిసి సభ నిర్వహించే స్థలాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు.
సభకు భారీ సంఖ్యలో ప్రజలు, పార్టీ కార్యకర్తలు, అభిమానులు హాజరయ్యే అవకాశం ఉన్నందున సభా ప్రాంగణంలో చేపట్టాల్సిన ఏర్పాట్లపై అధికారులతో చర్చించారు. సభకు వచ్చే ప్రజలకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని సూచించారు. ముఖ్యంగా రవాణా సౌకర్యం, వాహనాల పార్కింగ్, తాగునీటి వసతి, ప్రజల రాకపోకలకు ఇబ్బందులు లేకుండా తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ, అర్బన్ మండల తహసీల్దార్‌తో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బందితో మాట్లాడి సభ నిర్వహణకు సంబంధించి పలు సూచనలు చేశారు. ప్రజల భద్రత, సౌకర్యాలకు ప్రాధాన్యతనిస్తూ సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేట పర్యటన నేపథ్యంలో సభను విజయవంతం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు దాస అంజయ్య, మార్క సతీష్ కుమార్, జిల్లా మహిళా కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు ముద్దం లక్ష్మి, అర్బన్ మండల అధ్యక్షులు కొలిమి బిక్షపతి, దుర్గాప్రసాద్, శ్రీకాంత్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.