📄 ePaper
Sunday, August 30, 2026
Homeఎడిటోరియల్ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బొజ్జల బృందమ్మ..

ఎన్టీఆర్ 30వ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన బొజ్జల బృందమ్మ..

📰 Generate e-Paper Clip

ఎర్పేడు బస్టాండ్ కూడలిలో అన్నదానంతో ఘనంగా వర్ధంతి కార్యక్రమం. ఎన్టీఆర్ సేవలు తరతరాలకు ఆదర్శమని నేతల కొనియాడకం
టీడీపీ నాయకులుకార్యకర్తల భారీ పాల్గొనడంతో కార్యక్రమం విజయవంతం.
పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో నివాళుల కార్యక్రమం.

మనప్రజాప్రతినిధి//ఏర్పేడుమండలం.జనవరి18
దివంగత నేత, మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారకరామారావు 30వ వర్ధంతి సందర్భంగా ఏర్పేడు మండలంలో ఘన నివాళుల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మ పాల్గొని ఎన్టీఆర్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులు అర్పించారు.తెలుగు జాతి గర్వాన్ని ప్రపంచానికి చాటిన మహానేత ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన ప్రజానాయకుడ ని నాయకులు కొనియాడారు. పేదల గుండె చప్పుడు విన్న నాయకు డు, ప్రజలకు అండగా నిలిచిన యోధుడు ఎన్టీఆర్ అని పేర్కొన్నారు. రాజకీయాల్లో విలువలు, స్వాభిమానం నింపిన అపూర్వ నాయకుడిగా, సామాన్యుడి ఆత్మగౌరవానికి స్వరం ఇచ్చిన మహానుభావుడిగా ఎన్టీఆర్ చరిత్రలో నిలిచారని తెలిపారు. తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి బలమైన పునాది వేసిన దూరదృష్టి గల నాయకుడు ఎన్టీఆర్ అని అన్నారు. ఆయన చూపిన మార్గం తరతరాలకు ఆదర్శమని స్పష్టం చేశారు.వర్ధంతి సందర్భంగా ఏర్పేడు బస్టాండ్ కూడలిలో ఏర్పేడు మండల టీడీపీ పార్టీ అధ్యక్షులు పేరం నాగరాజ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బొజ్జల బృందమ్మతో పాటు వ్యవసాయ మార్కెట్ ఛైర్మన్ రంగినేని చంచయ్య నాయుడు, ఉమ్మడి చిత్తూరు జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ రెడ్డి వారి గురువారెడ్డి, టీడీపీ సీనియర్ నాయకులు పేరం ధనంజయులు నాయుడు, ఏర్పేడు పీఏసీఎస్ ఛైర్మన్ మహేష్ రెడ్డి, మోహన్ నాయుడు, బాబు నాయుడు పాల్గొన్నారు.అలాగే పార్లమెంట్ మహిళా ఉపాధ్యక్షులు గాలి కృష్ణవేణి, అమందూర్ సర్పంచ్ గుణాయాదవ్, మునిరెడ్డి, పార్లమెంట్ ఉపాధ్యక్షులు రాచటి సుబ్రహ్మణ్యం, తిరుపతి పార్లమెంట్ అధికార ప్రతినిధి కేకే రమణ, రాఘవేంద్ర, చంద్రశేఖర్ నాయుడు, సురేష్, హరి, రవి, రవినాయుడు, సూరి నాయుడు, సీతాపతి ఆచారి, నాగేశ్వర్ రావు (శీను), సుధాకర్ రెడ్డి, గోపాల్ రెడ్డి, రాంబత్తయ్య, బాల సుబ్రహ్మణ్యం, రమేష్, బాలాజీ, మునేశ్వర్, సుబ్రహ్మణ్యం, నరసింహులు నాయుడు, బాలకృష్ణారెడ్డి, నాగూర్ నాయుడు, మస్తాన్ నాయుడు, నరేంద్ర, సుధాకర్ నాయుడు, మనోహర్ నాయుడు తదితర తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.