📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుగుట్టకింది గ్రామంలో పెద్దమ్మకు ఘనంగా బోనాల పండుగ

గుట్టకింది గ్రామంలో పెద్దమ్మకు ఘనంగా బోనాల పండుగ

📰 Generate e-Paper Clip


ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పోతరాజు ప్రవీణ్ ప్రత్యేక ఆకర్షణ
మెదక్ జిల్లా.మనప్రజాప్రతినిధి//జనవరి31
మెదక్ జిల్లా పరిధిలోని గుట్టకింది గ్రామంలో శుక్రవారం గ్రామ దేవత పెద్దమ్మకు ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో బోనాల పండుగను భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోతరాజు ప్రవీణ్ ప్రత్యేక వేషధారణతో బోనాలు తీసి గ్రామస్తులను ఆకట్టు కున్నారు.పెద్దమ్మ ఆలయ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో మహిళలు బోనాలు సమర్పించి, పురుషులు డప్పులు,వాయిద్యాలతో అమ్మవారి మహిమను కీర్తించారు. భక్తుల “జై పెద్దమ్మ” నినాదాలతో గ్రామం మార్మోగింది.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ సంఘం అధ్యక్షులు మహేష్, ఉపాధ్యక్షులు దుర్గయ్య, ప్రధాన కార్యదర్శి రమేష్, సహాయ కార్యదర్శి అశోక్, కోశాధికారి శ్రీనివాస్, ఆలయ పూజారి శంకరయ్య, సభ్యులు లక్ష్మయ్య, నర్సింలు, లక్ష్మీనారాయణ, కిష్టయ్య, కుమార్, మల్లేశం, చందు తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.గ్రామ శ్రేయస్సు, ప్రజల ఆరోగ్యం, పంటల సమృద్ధి కోసం పెద్దమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించామని నిర్వాహకులు తెలిపారు. బోనాల పండుగ సందర్భంగా గ్రామంలో భక్తి వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular