📄 ePaper
Tuesday, July 14, 2026
Homeతెలంగాణకష్టసుఖాల్లో పాలు పంచుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి

కష్టసుఖాల్లో పాలు పంచుకుంటా ఒక్క అవకాశం ఇవ్వండి

📰 Generate e-Paper Clip

– 6వ వార్డు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సతీష్ కుమార్

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ ఫిబ్రవరి 6:
నారాయణఖేడ్ మున్సిపాలిటీ 6వ వార్డులో బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సతీష్ కుమార్ ప్రజల కష్టసుఖాల్లో భాగస్వామిగా నిలిచి, వార్డు సమగ్ర అభివృద్ధే లక్ష్యంగా పని చేస్తానని తెలిపారు. యువ నాయకుడిగా ప్రజలకు అందుబాటులో ఉండే నాయకత్వాన్ని అందిస్తానని ఆయన భరోసా ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇంటింటా తిరుగుతూ ప్రజలను కలిసి ఆశీర్వాదం కోరిన సతీష్ కుమార్ మాట్లాడుతూ.. తాగునీరు, డ్రైనేజీ, రహదారులు, పారిశుధ్యం వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి తొలి ప్రాధాన్యం ఇస్తానన్నారు. అలాగే పేదల సమస్యలను వెంటనే గుర్తించి పరిష్కరించే విధంగా పనిచేస్తానని స్పష్టం చేశారు.
బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను 6వ వార్డుకు పూర్తిస్థాయిలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తానని, ప్రతి కుటుంబానికి అండగా నిలిచే కౌన్సిలర్‌గా సేవలందిస్తానని సతీష్ కుమార్ తెలిపారు.
అభివృద్ధి, సంక్షేమం, పారదర్శక పాలన కోసం ఒక్క అవకాశం ఇవ్వాలని, కారు గుర్తుకు ఓటేసి భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular