📄 ePaper
Saturday, October 17, 2026
Homeఎడిటోరియల్విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి

విశ్వహిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఘనంగా శివాజీ జయంతి

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//మనకొండూరు,ఫిబ్రవరి20:
ఇల్లంతకుంట మండల కేంద్రంలోని బస్టాండ్ ఆవరణలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో హిందూ సామ్రాట్ చత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఇల్లంత కుంట గ్రామ సర్పంచ్ మామిడి రాజు హాజరయ్యారు.మండల అధ్యక్షుడు ఎగుర్ల శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎగుర్ల శ్రీనివాస్ మాట్లాడుతూ, అసంఘటితంగా ఉన్న హిందూ సమాజాన్ని జాగృతం చేసి సంఘటితం చేసిన మహోన్నత నాయకుడు చత్రపతి శివాజీ మహారాజ్ అని పేర్కొన్నారు. కార్యక్రమానికి విచ్చేసిన యువకులు, ప్రజాప్రతినిధులు, గ్రామ ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.సర్పంచ్ మామిడి రాజు మాట్లాడుతూ, 1630లో జిజియా మాతకు జన్మించిన శివాజీ మహారాజ్ 16 ఏళ్ల వయసులోనే తొరణాకోటను జయించి, అనంతరం అనేక కోటలను స్వాధీనం చేసుకొని 1674లోపట్టాభిషేకం పొందారని వివరించారు. కుల, మత భేదాలు లేకుండా సుపరిపాలన అందించిన గొప్ప రాజుగా చరిత్రలో నిలిచారని కొనియాడారు. ఆయన ఆశయాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్ ముగు నాగరాజు శర్మ, గ్రామ పంచాయతీ పాలకవర్గ సభ్యులు, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ కరీంనగర్ జిల్లా పర్యావరణ ప్రముఖ్ బత్తిని ఆంజనేయులు, ఖండ కార్యవాహ తాటిపల్లి మహేష్, వ్యవస్థ ప్రముఖ్ కాసుపాక కిషన్, సేవా ప్రముఖ్ బొల్లం ధనుంజయ్,స్వామివివేకానంద ఇల్లంతకుంట మండల ఉత్సవ సమితి అధ్యక్షులు డాక్టర్ జగన్మోహన్ రావు, స్వామి వివేకానంద గ్రామ సేవా సమితి అధ్యక్షులు మామిడి పరుశురాం, నాయకులు మామిడి నరేష్, సాయి గౌడ్, మల్లేశం, కొనబోయిన బాలరాజ్ తదితరులు, గ్రామ ప్రజలు, యువకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.