📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలునూతన ఉపసర్పంచ్ ధారబోయిన సృజన సంపత్ యాదవ్‌కు ఘన సన్మానం

నూతన ఉపసర్పంచ్ ధారబోయిన సృజన సంపత్ యాదవ్‌కు ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

స్వామి చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో అభినందన కార్యక్రమం
మనప్రజాప్రతినిధి//సిద్దిపేటనియోజకవర్గం.డిసెంబర్19
రెండవ విడత సర్పంచ్ ఎన్నికలలో భాగంగా పొన్నాల గ్రామ ఉపసర్పంచ్‌గా ఘన విజయం సాధించిన ధారబోయిన సృజన సంపత్ యాదవ్‌కు దుద్దెడ గ్రామానికి చెందిన చింతల స్వామి చరణ్ యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ఉపసర్పంచ్ ధారబోయిన సృజన సంపత్ యాదవ్ మాట్లాడుతూ,గ్రామ అభివృద్ధి కోసం మన సంఘంతో పాటు గ్రామ ప్రజలందరి సహకారం ఎంతో అవసరమని పేర్కొన్నారు. గ్రామ ప్రజలందరూ ఒక కుటుంబంలా ఐక్యంగా ఉంటే, పొన్నాల గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుకోవచ్చని తెలిపారు. తనపై విశ్వాసంతో అద్భుతమైన విజయాన్ని అందించిన గ్రామ ప్రజలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.ఈ సన్మాన కార్యక్రమంలో పొన్నాల గ్రామానికి చెందిన యువకులు అఖిల్, నిఖిల్, శ్రావణ్, వంశీ తదితరులు పాల్గొని నూతన ఉపసర్పంచ్‌కు శుభాకాంక్షలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.