📄 ePaper
Tuesday, September 1, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుప్రమాణ స్వీకారానికి ముందే ప్రజాపాలనకు శ్రీకారం

ప్రమాణ స్వీకారానికి ముందే ప్రజాపాలనకు శ్రీకారం

📰 Generate e-Paper Clip

ఇచ్చిన మాట నిలబెట్టుకున్నయువసర్పంచ్ నాయినినవీన్ కుమార్
మనప్రజాప్రతినిధి//మనకొండూరు.డిసెంబర్19
ఇల్లంతకుంట మండలం వెల్జిపూర్ గ్రామంలో యువ సర్పంచ్ నాయిని నవీన్ కుమార్ ప్రజల నమ్మకాన్ని పనుల ద్వారా నిలబెట్టుకున్నారు. అధికారికంగా బాధ్యతలు చేపట్టకముందే గ్రామాభివృద్ధికి చర్యలు ప్రారంభించి, మాటకంటే పని ముఖ్యమని నిరూపించారు. ఏళ్ల తరబడి తాగునీటి కొరతతో ఇబ్బంది పడుతున్న 1, 2, 8, 10వ వార్డుల ప్రజలకు తక్షణ పరిష్కారం చూపుతూ కొత్త మోటార్లు, షాటర్లు ఏర్పాటు చేయించారు. దీంతో ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న మంచి నీటి సమస్యకు పూర్తిస్థాయి ఉపశమనం లభించింది.గ్రామ ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని, ఆలస్యం లేకుండా నిర్ణయాలు తీసుకోవడం యువ సర్పంచ్ పాలనకు ప్రత్యేకతగా మారింది.ఈసందర్భంగాఆయన మాట్లాడుతూ-“ప్రజలే నా బలం. గ్రామంలో ఎవరికైనా సమస్య ఉంటే అది నా బాధ్యత. ఇచ్చిన ప్రతి హామీని తప్పకుండా నెరవేరుస్తాను” అని భరోసా ఇచ్చారు.నీటి సమస్య తీరడంతో ఆయా వార్డుల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ, యువ సర్పంచ్‌కు అభినందనలు తెలిపారు. వెల్జిపూర్ గ్రామంలో ఇది నిజమైన ప్రజాపాలనకు ఆరంభమని గ్రామస్తులు చెబుతున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.