📄 ePaper
Monday, August 31, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుఈనెల 26న చేగుంటలో వర్ధంతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

ఈనెల 26న చేగుంటలో వర్ధంతి కార్యక్రమం పోస్టర్ ఆవిష్కరణ

📰 Generate e-Paper Clip

ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన పోరాట యోధుడు కేవల్ కిషన్
దున్నేవాడికే భూమి నినాదానికి ప్రాణప్రతీక – కామ్రేడ్ కేవల్ కిషన్
పోరాట యోధుడు-పేదల ఆరాధ్య దైవం కామ్రేడ్ కేవల్ కిషన్
పోరాట స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనం కామ్రేడ్ కేవల్ కిషన్ మైనంపల్లి హనుమంత్ రావు మెదక్.మనప్రజాప్రతినిధి//డిసెంబర్19పేదల హక్కులు, భూ హక్కుల సాధన కోసం జీవితాంతం పోరాడిన మహనీయుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని, ఆయన ఆశయాలను నేటి తరానికి చేరవేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంత్ రావు అన్నారు. ఈ నెల 26న మెదక్ జిల్లా చేగుంట మండలంలో నిర్వహించనున్న కామ్రేడ్ కేవల్ కిషన్ వర్ధంతి కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను మైనంపల్లి హన్మంత్ రావ్ చేతుల మీదుగా ఘనంగా ఆవిష్కరించారు.ఈ సందర్భంగా మైనంపల్లి హనుమంత్ రావ్ మాట్లాడుతూ, చేగుంట మండలం పొలంపల్లి గ్రామంలో ఉన్న స్వర్గీయ కామ్రేడ్ కేవల్ కిషన్ ముదిరాజ్ సమాధి వద్ద ప్రతి సంవత్సరం నిర్వహించే వర్ధంతి కార్యక్రమం ప్రజా ఉద్యమాల చరిత్రను గుర్తుచేసే పవిత్ర వేడుకగా నిలుస్తోందని అన్నారు. పేదల కోసం, కార్మికుల హక్కుల కోసం తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా పోరాడిన నాయకుడు కామ్రేడ్ కేవల్ కిషన్ అని కొనియాడారు.మెదక్ ప్రాంతంలో జమిందారుల దౌర్జన్యాలకు ఎదురొడ్డి నిలిచి, “దున్నేవాడికే భూమి” నినాదంతో భూ పోరాటాలను ముందుండి నడిపిన మహనీయుడిగా కామ్రేడ్ కేవల్ కిషన్ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారని మైనంపల్లి హనుమంత్ రావ్ పేర్కొన్నారు. ఇలాంటి పోరాట నాయకుల స్ఫూర్తితో యువత సామాజిక మార్పు దిశగా అడుగులు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ జిల్లా అధ్యక్షులు మానేగల రామ కిష్టయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుట్టి అక్షయ్ కుమార్, జమ్మిగారి కనకయ్య, మానేగల భాస్కర్, కిష్టయ్య, స్వామి, భాను, సల్మాన్, మెదక్ జిల్లా ప్రచార కార్యదర్శి కుర్తివాడ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.