📄 ePaper
Saturday, August 29, 2026
Homeతెలంగాణజిల్లా వార్తలుక్రిప్టో మోసం బట్టబయలు: ‘ఈగల్ కాయిన్’ పేరుతో రూ.11 లక్షల దోపిడి..

క్రిప్టో మోసం బట్టబయలు: ‘ఈగల్ కాయిన్’ పేరుతో రూ.11 లక్షల దోపిడి..

📰 Generate e-Paper Clip

చైన్ సిస్టమ్ ముసుగులో భారీ మోసం: ఆరుగురిపై కేసు
18 నెలల్లో రూ.30 లక్షల ఆశ చూపి రూ.11 లక్షలు మాయం

•హై రిటర్న్స్ మాయలో అమాయకుడు…ఆరుగురిపై కేసు నమోదు
మనప్రజాప్రతినిధి//సిరిసిల్ల టౌన్.జనవరి24
మల్టీ లెవల్ మార్కెటింగ్, క్రిప్టో కరెన్సీ పేరుతో అమాయక ప్రజలను నమ్మించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన భారీ మోసం సిరిసిల్లలో వెలుగుచూసింది. ‘ఈగల్ కాయిన్’ పేరుతో జరిగిన ఈ క్రిప్టో స్కాంలో ఆరుగురు వ్యక్తులపై రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ మోసానికి సంబంధించిన వివరాలను సిరిసిల్ల టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ శుక్రవారం మీడియాకు వెల్లడించారు.
హై రిటర్న్స్ ఆశ చూపి మోసం:
సిరిసిల్ల పట్టణానికి చెందిన ముచ్చ రాజేందర్‌ను నిందితులు ‘Egal Coin (ఈగల్ కాయిన్)’ అనే ఆన్‌లైన్ కంపెనీ పేరుతో సంప్రదించారు. ఇందులో పెట్టుబడి పెడితే ‘చైన్ సిస్టమ్’ ద్వారా భారీ లాభాలు వస్తాయని నమ్మబలికారు. 18 నెలల్లో రూ.11 లక్షల పెట్టుబడికి రూ.30 లక్షలు వస్తాయని ఆశ చూపడంతో బాధితుడు వారి మాటలను నమ్మి మొత్తం రూ.11 లక్షలు పెట్టుబడి పెట్టారు.
అయితే గడువు పూర్తయినా నిందితులు కేవలం రూ.1.20 లక్షలు మాత్రమే తిరిగి చెల్లించి, మిగిలిన మొత్తాన్ని అడిగితే తప్పించుకుంటూ వచ్చారు. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
కేసు నమోదు చేసిన నిందితులు:
పాశికంటి లవన్ కుమార్ (33) – బీవై నగర్
దోమల ప్రవీణ్ (41) – బీవై నగర్
ఆడెపు శ్రీధర్ (44) – అశోక్ నగర్
వంగరి వేణు గోపాల్ (40) – ప్రగతి నగర్
మంచికట్ల సుధాకర్ (42) – నెహ్రూ నగర్
సుభాష్ – సిరిసిల్ల
పోలీసుల హెచ్చరిక:
“అధిక లాభాల పేరుతో వచ్చే క్రిప్టో కరెన్సీలు, చైన్ సిస్టమ్ మార్కెటింగ్ స్కీమ్స్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ‘ఈగల్ కాయిన్’ పేరుతో మోసపోయిన వారు ఇంకా ఎవరైనా ఉంటే ధైర్యంగా ముందుకు వచ్చి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలి” అని టౌన్ ఇన్స్పెక్టర్ కృష్ణ సూచించారు.ప్రస్తుతం నిందితులపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.