📄 ePaper
Saturday, October 17, 2026
Homeతెలంగాణ11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా వర్ష నగేష్ నామినేషన్ దాఖలు

11వ వార్డులో బిఆర్ఎస్ అభ్యర్థిగా వర్ష నగేష్ నామినేషన్ దాఖలు

📰 Generate e-Paper Clip

మనప్రజాప్రతినిధి//నారాయణఖేడ్ జనవరి 29:


నారాయణఖేడ్ మున్సిపాలిటీ 11వ వార్డుకు భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) పార్టీ బలపరిచిన అభ్యర్థిగా బాధలుగామా వర్ష నగేష్ నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ శ్రేణులు, నాయకులతో కలిసి నామినేషన్ ప్రక్రియను పూర్తి చేశారు. నామినేషన్ వేసిన సందర్భంగా నగేష్ మాట్లాడుతూ, ప్రజల నమ్మకాన్ని గెలుచుకుని వార్డు అభివృద్ధికి కృషి చేయడమే తన ప్రధాన లక్ష్యమని తెలిపారు. మౌలిక సదుపాయాల అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు.తనపై విశ్వాసం ఉంచి ఈ అవకాశం కల్పించిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డికి వర్ష నగేష్ ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. బిఆర్ఎస్ పార్టీ విధానాలు, కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లి, ఘన విజయం సాధిస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, స్థానిక ప్రజాప్రతినిధులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install MPP News App

Add to home screen for faster loading and latest updates.